బాక్సైట్‌పై సీరియస్‌గా జోకేసిన చంద్రబాబు

విశాఖ బాక్సైట్‌. ఇప్పుడు రాష్ట్రంలో రగులుతున్న అంశం. ఈ వ్యవహారాన్ని డీల్‌ చేయడంలో ఏమాత్రం తేడా వచ్చినా పరిణామాలు అంచనా వేయడం కూడా కష్టమే. మావోయిస్టులు మరోసారి విజృంభించేందుకు ఏంతో ఊతమిచ్చే అంశం. లక్షలాది మంది గిరిజనుల జీవితాలను ప్రభావితం చేసే వ్యవహారం. ఇంత కీలకమైన విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తెలియదంటే నమ్మడం సాధ్యమేనా?. కానీ నమ్మాల్సిందే. బాక్సైట్ తవ్వకాల జీవో గురించి చంద్రబాబుకు తెలియదట. అటవీ శాఖ మంత్రి కూడా తెలిదంటే ఎంత […]

Advertisement
Update:2015-11-17 03:53 IST

విశాఖ బాక్సైట్‌. ఇప్పుడు రాష్ట్రంలో రగులుతున్న అంశం. ఈ వ్యవహారాన్ని డీల్‌ చేయడంలో ఏమాత్రం తేడా వచ్చినా పరిణామాలు అంచనా వేయడం కూడా కష్టమే. మావోయిస్టులు మరోసారి విజృంభించేందుకు ఏంతో ఊతమిచ్చే అంశం. లక్షలాది మంది గిరిజనుల జీవితాలను ప్రభావితం చేసే వ్యవహారం. ఇంత కీలకమైన విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తెలియదంటే నమ్మడం సాధ్యమేనా?. కానీ నమ్మాల్సిందే. బాక్సైట్ తవ్వకాల జీవో గురించి చంద్రబాబుకు తెలియదట. అటవీ శాఖ మంత్రి కూడా తెలిదంటే ఎంత విచిత్రం?.

సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ విచిత్రమే జరిగింది. బాక్సైట్ జీవో మీకు తెలిసే విడుదలైందా అని మంత్రి గంటా శ్రీనివాస్‌ తొలుత అడిగారు. ఇందుకు చంద్రబాబు తనకు తెలియకుండానే జీవో విడుదలైందని చెప్పారు. అటవీ శాఖ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి కూడా తనకు తెలియకుండానే జీవో వచ్చిందని సెలవిచ్చారు. మరీ ఎవరి ద్వారా జీవో విడుదలైందా అని మిగిలిన మంత్రులు తెల్లమొహాలేసుకుని చూశారు. ఇంతలో తేరుకున్న చంద్రబాబు అధికారులపై ఉరిమారు.

ఎవరికీ తెలియకుండా ఎలా జీవో జారీ అయిందంటూ అధికారులను ప్రశ్నించారు సీఎం. దీంతో కంగుతినడం అధికారుల వంతు అయింది. వెంటనే చంద్రబాబు అంతరంగం అర్థం చేసుకున్న ఉన్నతాధికారులు… కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చాయని… వాటి ఆధారంగా ఉత్తర్వులు జారీ అయ్యాయని కవర్ చేశారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి కాబట్టి ఫైల్‌ను సీఎం, సంబంధిత మంత్రికి పంపకపోయి ఉండవచ్చని అధికారులు కూడా తమ తెలివితేటలను ప్రదర్శించి కథను రక్తికట్టించారు.

అదన్న మాట అత్యంత సున్నితమైన, కీలకమైన బాక్సైట్ తవ్వకాల జీవో చంద్రబాబుకు తెలియకుండా విడుదలైందట. ఒకవేళ చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదన్నది కూడా మరో ప్రశ్న. తన పాలనతో చీమచిటుక్కుమన్నా టెక్నాలజీ ద్వారా తనకు తెలిసిపోతుందని చెప్పుకుని చంద్రబాబు బాక్సైట్ జీవో తన ప్రమేయం లేకుండా వచ్చిందని చెప్పారు. ఫైనల్‌గా సమావేశంలో బాక్సైట్‌ తవ్వకాలపై వెనక్కు తగ్గాలని కేబినెట్ నిర్ణయించుకుంది.

Tags:    
Advertisement

Similar News