సారిక కేసులో సన అరెస్ట్
కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ఈకేసులో అనుమానితురాలిగా భావిస్తున్న అనిల్ రెండో భార్య సనను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సన ఏ4 నిందితురాలుగా ఉంది. సారిక మృతి తరువాత పరారీలో ఉన్న సన కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సను ఖమ్మంలో అరెస్ట్ చేశారు. ఆమెను పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరుస్తారు. […]
Advertisement
కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ఈకేసులో అనుమానితురాలిగా భావిస్తున్న అనిల్ రెండో భార్య సనను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సన ఏ4 నిందితురాలుగా ఉంది. సారిక మృతి తరువాత పరారీలో ఉన్న సన కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సను ఖమ్మంలో అరెస్ట్ చేశారు. ఆమెను పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరుస్తారు.
మరోవైపు ఇప్పటికే సారిక, ముగ్గురు పిల్లలు చనిపోవడానికి సంబంధించిన కేసులో రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. సారికది ఆత్మహత్యగానే రిమాండ్ రిపోర్టులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే సారిక ఆత్మహత్య చేసుకోవడానికి భర్త అనిల్, మామ రాజయ్య, అత్త మాధవితోపాటు అనిల్ రెండో భార్య సనా వేధింపులు కూడా కారణమని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. దీంతో సనను ఏ4 నిందితురాలిగా చేర్చి అరెస్ట్ చేశారు.
Advertisement