రాజధానిపై మైసూరా కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతిపై సీనియర్ నేత మైసూరా రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాయలసీమ వాళ్లు తమ రాజధానిగా గుర్తించడం లేదని చెప్పారు. తాము ఎదో ఒక రోజు వీడిపోవాల్సి వారిమేనన్నారు. దేశంలో మరో రాష్ట్రం ఏర్పడకూడదా అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్‌ వద్దని చెప్పిన చోటే కావాలని ప్రభుత్వం ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసిందని  ఆక్షేపించారు.    టీడీపీ నేతలంతా ముందే భూములు కొనుక్కొని ఆ తర్వాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారని ఆరోపించారు. […]

Advertisement
Update:2015-10-27 03:13 IST

ఏపీ రాజధాని అమరావతిపై సీనియర్ నేత మైసూరా రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాయలసీమ వాళ్లు తమ రాజధానిగా గుర్తించడం లేదని చెప్పారు. తాము ఎదో ఒక రోజు వీడిపోవాల్సి వారిమేనన్నారు. దేశంలో మరో రాష్ట్రం ఏర్పడకూడదా అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్‌ వద్దని చెప్పిన చోటే కావాలని ప్రభుత్వం ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసిందని ఆక్షేపించారు.

టీడీపీ నేతలంతా ముందే భూములు కొనుక్కొని ఆ తర్వాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారని ఆరోపించారు. ఆ వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని అయితే ఎప్పటికైనా వెళ్లిపోయే వారమని, అందుకే విషయాలు బయటపెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాజధాని విషయాల గురించి కూడా రాయలసీమ వాళ్లు పెద్దగా పట్టించుకోవడం లేదని మైసూరారెడ్డి చెప్పారు.

టీడీపికి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దె రత్తయ్య కుమారుడు చంద్రశేఖర్‌కు చెందిన చెరుకు పంటనే తగబెట్టడం బట్టి పరిస్థితులు రాజధాని ప్రాంతలో ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతం మొత్తం ల్యాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News