ఆ జ్ఞాపకం...బాల్యం చేసిన సంతకం!
పెద్దయ్యాక చాలా సాధారణం అనిపించే విషయాలు, అసలు విషయాలే కానివి… చిన్నతనంలో అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే బాల్యం అందమైనది, అద్భుతమైంది. వయసు, తెలివితేటలు వచ్చాక ఆ ఆనందాలు మాయం అయిపోతాయి. వాటితాలూకూ తీపి గుర్తులు మాత్రం మిగులుతాయి. విచిత్రం ఏమిటంటే చిన్నప్పటి తెలివితక్కువ ఆలోచనలు, పనులు పెద్దయ్యాక తలుచుకుంటే మాత్రం…ఆ ఏముందిలే అని పక్కకు నెట్టేయలేము, ఆ జ్ఞాపకాలు ఇచ్చిన అనుభూతులను తాజాగా నెమరువేసుకుంటాం. అవును మనమూ ఇలాగే చేశాం…అని అందరూ అనుకునే చిన్ననాటి చిలిపిపనులు ఇవి…మీరూ చదివి పెదవులపైకి ఓ జ్ఞాపకాల చిరునవ్వు తెమ్మెరని తెచ్చుకోండి- -చేతులను షర్టులోపలికి […]
పెద్దయ్యాక చాలా సాధారణం అనిపించే విషయాలు, అసలు విషయాలే కానివి… చిన్నతనంలో అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే బాల్యం అందమైనది, అద్భుతమైంది. వయసు, తెలివితేటలు వచ్చాక ఆ ఆనందాలు మాయం అయిపోతాయి. వాటితాలూకూ తీపి గుర్తులు మాత్రం మిగులుతాయి. విచిత్రం ఏమిటంటే చిన్నప్పటి తెలివితక్కువ ఆలోచనలు, పనులు పెద్దయ్యాక తలుచుకుంటే మాత్రం…ఆ ఏముందిలే అని పక్కకు నెట్టేయలేము, ఆ జ్ఞాపకాలు ఇచ్చిన అనుభూతులను తాజాగా నెమరువేసుకుంటాం. అవును మనమూ ఇలాగే చేశాం…అని అందరూ అనుకునే చిన్ననాటి చిలిపిపనులు ఇవి…మీరూ చదివి పెదవులపైకి ఓ జ్ఞాపకాల చిరునవ్వు తెమ్మెరని తెచ్చుకోండి-
-ఆటలు ఆడేటప్పుడు తోబుట్టువులతో తగువులు పడటం…మనం ఓడిపోతే…తూచ్ మళ్లీ మొదటినుండి ఆడాల్సిందేనని పట్టుబట్టడం
-బొమ్మలన్నింటినీ పక్కనపెట్టుకుని నిద్రపోవడం…ఎందుకంటే దేన్ని వదిలేసినా అది బాధపడుతుందని నమ్మడం వలన.
-ఆరు రంగుల రీఫిల్స్ ఉన్న పెన్నుని వాడుతూ, వాటన్నింటినీ ఒకేసారి కిందికి తేవాలని ప్రయత్నించడం.
-అందరితో కలిసి సినిమాకో, షాపింగ్‌కో వెళ్లి రాత్రులు తిరిగి వస్తున్నపుడు… నాన్న ఎత్తుకుంటాడని…నిద్రని నటించడం.
-కిటికీలోంచి వర్షాన్ని చూడటం. ఏ చినుకు వేగంగా పడుతుందో చూడాలని ప్రయత్నించడం.
-పొరబాటున పళ్లకు సంబంధించిన గింజలను మింగేసి, పొట్టలో చెట్లు మొలుస్తాయేమో అని భయపడటం.
-చేతులకు జిగురు రాసుకుని అది ఆరిపోయాక దాన్ని లాగేస్తూ…అది పొరలా వచ్చేస్తుంటే చర్మమే అలా వస్తుందని ఫీలయిపోవడం.