బీహార్ బీజేపీదేనా..? సర్వే సరైనదేనా...?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగుబోతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఒకవైపు.. మిగతా విపక్షాలు ఓవైపు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో అక్టోబర్ 12న తొలి విడత ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఓటర్ల నాడి ఎలా ఉందన్న దానిపై ఓ జాతీయ చానల్ నిర్వహించిన […]
Advertisement
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగుబోతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఒకవైపు.. మిగతా విపక్షాలు ఓవైపు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో అక్టోబర్ 12న తొలి విడత ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది.
ఈ నేపథ్యంలో బీహార్ ఓటర్ల నాడి ఎలా ఉందన్న దానిపై ఓ జాతీయ చానల్ నిర్వహించిన సర్వేలో బీజేపీకే అధిక్యం వచ్చింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మోజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆ సర్వేలో తేలింది. బీజేపీ 53.8 శాతం ఓట్లతో 187 సీట్లు సాధిస్తుందని, లాలూ, నితీష్ నేతృత్వంలోని మహా కూటమికి 40.2 శాతం ఓట్లతో 64 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. ఇక స్వతంత్రులు, ఇతరుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం ఉండబోదని తేల్చింది. అయితే ఈ సర్వే విశ్వసనీయత ఎంతా అనేది ప్రశ్నార్ధకమే…
బీహార్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 54.6 శాతం ఓటర్ల ఎన్డీయే కూటమికి, 39.7 శాతం మంది మహా కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయి.
ఎప్పుడూ లాలూకు అండగా నిలిచే యాదవ వర్గం ఈసారి కూడా అండగా నిలిచినట్టు సర్వే స్పష్టం చేస్తోంది. 50 శాతానికి పైగా మహా కూటమి విజయం సాధిస్తుందని యాదవులు తెలుపగా, ఎన్డీయే గెలుస్తుందని 43.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. మొత్తం మీద బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే మరోసారి ప్రధాని మోడీ, ఆపార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం ఫలించినట్టు అవుతుంది. గెలుపు ఎవరిదన్నది నవంబర్ 8న జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.
Advertisement