ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. రాధేమా
ఈ మాటలన్నది ఎవరో కాదు..! వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా! భక్తులతో ముద్దులు, కౌగిలింతలు చిందులు, విందుల్లో మునుగుతూ ఉండే రాధేమాకు అంత కష్టం ఏమొచ్చిందనే కదా! మీ అనుమానం? అసభ్య నృత్యాలు, భక్తులతో ప్రత్యేకంగా గడిపిన వీడియోలు, అశ్లీలాన్ని ప్రోత్సహించే వస్త్రధారణతో ఒక్కసారిగా జాతీయ మీడియాను ఊపేసిన రాధేమా తరువాత చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే! రాధేమా అసలు స్వరూపం లోకానికి తెలియడంతో పలువురు ఆమె తమను ఎలా వేధించిందో వివరిస్తూ.. పలు పోలీస్ స్టేషన్లలో […]
ఈ మాటలన్నది ఎవరో కాదు..! వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా! భక్తులతో ముద్దులు, కౌగిలింతలు చిందులు, విందుల్లో మునుగుతూ ఉండే రాధేమాకు అంత కష్టం ఏమొచ్చిందనే కదా! మీ అనుమానం? అసభ్య నృత్యాలు, భక్తులతో ప్రత్యేకంగా గడిపిన వీడియోలు, అశ్లీలాన్ని ప్రోత్సహించే వస్త్రధారణతో ఒక్కసారిగా జాతీయ మీడియాను ఊపేసిన రాధేమా తరువాత చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే! రాధేమా అసలు స్వరూపం లోకానికి తెలియడంతో పలువురు ఆమె తమను ఎలా వేధించిందో వివరిస్తూ.. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. అలా తనపై కట్నం వేధింపులు, లైంగిక హింస ఆరోపణలు విన్నప్పడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధేమా వాపోయింది. ఈ విషయంలో ప్రశ్నించడానికి పోలీసులు రమ్మన్నప్పుడు తనకు ఎంతో బాధ కల్గిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కానీ తను నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షకు సిద్ధపడాలని భావించి ఉరుకున్నానని రాధేమా చెప్పుకొచ్చారు.