wonder world 41
కోరిన రంగులిచ్చే పెన్ను! పెన్ను రంగులివ్వడమేమిటా అనుకుంటున్నారా…? నిజమేనండి ఇది నిజంగా మనం కోరిన రంగులిచ్చే అద్భుతమైన పెన్ను ఇది. ఈ రంగులెక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారా.. లేకపోతే ఆ పెన్నులో రకరకాల ఇంకులు ముందుగానే నింపి ఉంచితే ఆ రంగులనే మనకు ఇస్తుందనుకుంటున్నారా.. అదేమీ లేదు. ఏ రంగు కావాలంటే ఆ రంగు ఉన్న చోట పెన్నును ఉంచితే ఆ రంగును సంగ్రహిస్తుంది. అంటే ఆకు రంగు కావాలంటే ఆకుపైన ఉంచాలి. యాపిల్ రంగు కావాలంటే యాపిల్‌పైన ఉంచాలి అంతే… […]
కోరిన రంగులిచ్చే పెన్ను!
పెన్ను రంగులివ్వడమేమిటా అనుకుంటున్నారా…? నిజమేనండి ఇది నిజంగా మనం కోరిన రంగులిచ్చే అద్భుతమైన పెన్ను ఇది. ఈ రంగులెక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారా.. లేకపోతే ఆ పెన్నులో రకరకాల ఇంకులు ముందుగానే నింపి ఉంచితే ఆ రంగులనే మనకు ఇస్తుందనుకుంటున్నారా.. అదేమీ లేదు. ఏ రంగు కావాలంటే ఆ రంగు ఉన్న చోట పెన్నును ఉంచితే ఆ రంగును సంగ్రహిస్తుంది. అంటే ఆకు రంగు కావాలంటే ఆకుపైన ఉంచాలి. యాపిల్ రంగు కావాలంటే యాపిల్‌పైన ఉంచాలి అంతే… సహజసిద్ధమైన రంగులను ఇది సంగ్రహించి తిరిగి మనకు ఇస్తుందన్నమాట. మనకు ఏ రంగులు కావాలో ఆ రంగులకు సంబంధించిన వన్నీ దగ్గరపెట్టుకుని ఇక రాయడానికి ఉపక్రమించాలన్నమాట. కొరియా డిజైనర్ జిన్సున్ పార్క్ రూపొందించిన ఈ పెన్నులోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇంకు అవసరం లేకుండానే రంగులను మార్చిమార్చి ఉపయోగిస్తూ రాసే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. భలే బాగుంది కదూ…