ఎక్సైజ్‌ ద్వారా రూ.36,500 కోట్ల అదనపు ఆదాయం

అదనపు ఆదాయం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల(ఏప్రిల్-ఆగస్టు) కాలంలో విధించిన ఎక్సైజ్ సుంకం వల్ల అదనంగా రూ.36,500 కోట్లు లభించాయి. ఈ మొత్తంలో ఒక్క పెట్రోల్, డీజిల్ విక్రయాల వల్లే రూ.30 వేల కోట్లు సమకూరినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నవంబర్ 2014 నుంచి జనవరి 2015 మధ్యకాలంలో ఇంధన ఉత్పత్తులపై సుంకాన్ని నాలుగుసార్లు పెంచారు. దీంతోపాటు క్లీన్ ఎనర్జీ సెస్‌ను రూ.100 […]

Advertisement
Update:2015-09-20 18:53 IST

అదనపు ఆదాయం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల(ఏప్రిల్-ఆగస్టు) కాలంలో విధించిన ఎక్సైజ్ సుంకం వల్ల అదనంగా రూ.36,500 కోట్లు లభించాయి. ఈ మొత్తంలో ఒక్క పెట్రోల్, డీజిల్ విక్రయాల వల్లే రూ.30 వేల కోట్లు సమకూరినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నవంబర్ 2014 నుంచి జనవరి 2015 మధ్యకాలంలో ఇంధన ఉత్పత్తులపై సుంకాన్ని నాలుగుసార్లు పెంచారు. దీంతోపాటు క్లీన్ ఎనర్జీ సెస్‌ను రూ.100 నుంచి 200కి పెంచడం ద్వారా మరో రూ.3 వేల కోట్లు లభించాయి. అలాగే ఆటో మొబైల్, వినియోగదారుల వస్తువులపై ఉన్న రాయితీని ఎత్తి వేయడంతో గడిచిన ఐదు నెలల్లో రూ.3,500 కోట్లు లభించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

Tags:    
Advertisement

Similar News