శరణార్థులపై బాష్పవాయు ప్రయోగం
సిరియా, ఇరాక్‌ల నుంచి ఐరోపా దేశాలకు శరణార్థుల తాకిడి అధికమవుతుండటంలో పలు దేశాలు ద్వారాలు మూసివేస్తున్నాయి. తాజాగా స్లొవేనియా తమ సరిహద్దుల్లో నిలిచిన వందల మంది శరణార్థులను చెదరగొట్టేందుకు వారిపై టియర్‌గ్యాస్ ప్రయోగించింది. శరణార్థులు బలవంతంగా తమ దేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారని సరిహద్దు పోలీసులు చెప్పారు. కాగా ప్రమాదకరమైన రీతిలో పడవల్లో ఐరోపా వైపు వస్తున్న శరణార్థులను కాపాడేందుకు ఇటలీ కోస్ట్‌గార్డులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో వారు ఎనిమిది ప్రదేశాల నుంచి 2,200 మందికి […]
సిరియా, ఇరాక్‌ల నుంచి ఐరోపా దేశాలకు శరణార్థుల తాకిడి అధికమవుతుండటంలో పలు దేశాలు ద్వారాలు మూసివేస్తున్నాయి. తాజాగా స్లొవేనియా తమ సరిహద్దుల్లో నిలిచిన వందల మంది శరణార్థులను చెదరగొట్టేందుకు వారిపై టియర్‌గ్యాస్ ప్రయోగించింది. శరణార్థులు బలవంతంగా తమ దేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారని సరిహద్దు పోలీసులు చెప్పారు. కాగా ప్రమాదకరమైన రీతిలో పడవల్లో ఐరోపా వైపు వస్తున్న శరణార్థులను కాపాడేందుకు ఇటలీ కోస్ట్‌గార్డులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో వారు ఎనిమిది ప్రదేశాల నుంచి 2,200 మందికి పైగా శరణార్థులను రక్షించారు. అయితే వీరిలో ఒక మహిళ మృతి చెందినట్టు తెలిసింది. వీరంతా లిబియా తీరం నుంచి ఇటలీవైపు వస్తున్నారని అధికారులు చెప్పారు.