మరో వివాదానికి తెరలేపిన మార్కెండేయ కట్జూ
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరినోళ్ళలో నానడం జస్టిస్ మార్కండేయ కట్జూకు అలవాటుగా మారిపోయినట్టుంది. తాజాగా ఆయన మరో వివాదానికి తెరదీశారు. ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్ దేశపు ఏజెంట్‌గా ఆయన అభివర్ణించారు. అంతటితో ఆగపోలేదు… రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీషర్ల తొత్తు’ అని మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఇద్దరికి ఎంతోమంది అభిమానులున్నారు. ఇందులో ఒకరిని విశ్వకవిగా సాహిత్యలోకం ఆదరిస్తోంది. ఈరెండు అభిప్రాయాలను ఆయన తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు […]
Advertisement
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరినోళ్ళలో నానడం జస్టిస్ మార్కండేయ కట్జూకు అలవాటుగా మారిపోయినట్టుంది. తాజాగా ఆయన మరో వివాదానికి తెరదీశారు. ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్ దేశపు ఏజెంట్‌గా ఆయన అభివర్ణించారు. అంతటితో ఆగపోలేదు… రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీషర్ల తొత్తు’ అని మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఇద్దరికి ఎంతోమంది అభిమానులున్నారు. ఇందులో ఒకరిని విశ్వకవిగా సాహిత్యలోకం ఆదరిస్తోంది. ఈరెండు అభిప్రాయాలను ఆయన తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు త్వరలో తాను కోల్‌కతా వెళతాననని కూడా ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రజాప్రతినిధుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో కట్జూ వ్యాఖ్యలపై సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పీకర్ బిమన్ బెనర్జీ వెల్లడించారు.
Advertisement