ముంబయిలో పట్టాలు తప్పిన లోకల్‌ ట్రయిన్‌

ముంబయిలోని అందేరి-విలేపార్లే మధ్య లోకల్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పడం వల్ల అటు ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ముంబయి నగరానికి జీవనాడిగా చెప్పుకునే ఈ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పడంతో కార్యాలయాలకు వెళ్ళే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు అసౌకర్యం ఏర్పడింది. ఉదయం అంధేరి నుంచి బయలుదేరిన ఈ లోకల్‌ ట్రయిన్‌ పరిమిత వేగంగా వెళుతున్నప్పటికీ ఏడు బోగోలు పట్టాలు తప్పాయి. ఇందులో నాలుగు బోగీలు […]

Advertisement
Update:2015-09-15 06:55 IST
ముంబయిలోని అందేరి-విలేపార్లే మధ్య లోకల్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పడం వల్ల అటు ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ముంబయి నగరానికి జీవనాడిగా చెప్పుకునే ఈ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పడంతో కార్యాలయాలకు వెళ్ళే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు అసౌకర్యం ఏర్పడింది. ఉదయం అంధేరి నుంచి బయలుదేరిన ఈ లోకల్‌ ట్రయిన్‌ పరిమిత వేగంగా వెళుతున్నప్పటికీ ఏడు బోగోలు పట్టాలు తప్పాయి. ఇందులో నాలుగు బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళే కొన్ని రైళ్ళు కూడా రద్దు చేయాల్సి వచ్చింది. లోకల్‌ ట్రయిన్‌ పట్టాలు తప్పడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒరిగిపోయిన నాలుగు బోగీల్లో ఉన్న ప్రయాణికులు స్వల్పంగా గాయాల పాలయ్యారు. కారణాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైలును, ఈ ప్రాంతంలో వెళ్ళే ఇతర రైళ్ళను పునరుద్దరించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఏడు బోగీలను పక్కు తీయడమే కాకుండా ట్రాక్‌ను కూడా సరి చేయాల్సి ఉన్నందున కొంత సమయం పట్టవచ్చని అంటున్నారు. రైల్వే సిబ్బంది సంఘటన స్థలికి చేరి సహాయక చర్యలు చేపట్టారు. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులను రైల్వే ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై అంతర్గత దర్యాప్తును చేపట్టారు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు.
Tags:    
Advertisement

Similar News