Wonder World 25

కార్గోలో మరణిస్తున్న పెంపుడు జంతువులు! విమానాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లాలనుకోవడం క్షేమం కాదు. ఎందుకంటే ప్రస్తుతానికి అన్ని విమానయాన కంపెనీలు పెంపుడు జంతువులను రవాణా వస్తువులుగానే పరిగణిస్తున్నాయి. కార్గోవిభాగంలోనే చేరవేస్తున్నాయి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఏటా వందల సంఖ్యలో పెంపుడు జంతువులు విమానయానం సందర్భంగా మరణించడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరుగుతున్నవి. —————————————————————————- యుద్ధసమయంలో ఆహారం ఏదంటే..! రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జనాలను రక్షించడం కోసం ఓ మహిళ తిండి తినడం మానేసిందట. వినడానికి విచిత్రంగా […]

Advertisement
Update:2015-09-12 18:34 IST

కార్గోలో మరణిస్తున్న పెంపుడు జంతువులు!


విమానాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లాలనుకోవడం క్షేమం కాదు. ఎందుకంటే ప్రస్తుతానికి అన్ని విమానయాన కంపెనీలు పెంపుడు జంతువులను రవాణా వస్తువులుగానే పరిగణిస్తున్నాయి. కార్గోవిభాగంలోనే చేరవేస్తున్నాయి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఏటా వందల సంఖ్యలో పెంపుడు జంతువులు విమానయానం సందర్భంగా మరణించడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరుగుతున్నవి.
—————————————————————————-
యుద్ధసమయంలో ఆహారం ఏదంటే..!


రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జనాలను రక్షించడం కోసం ఓ మహిళ తిండి తినడం మానేసిందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. యుద్ధ సమయంలో రేషన్‌ విషయంలో అందరికీ ఆందోళన ఉండేది. పౌష్టికాహారం లభించడం లేదన్న చింత ఉండేది. దీంతో ఎల్సీ విడ్డోసన్‌ అనే మహిళా సైంటిస్టు పౌష్టికాహారం విషయంలో ఉండే అపోమలను తొలగించడానికి నడుం బిగించింది. కేవలం బ్రెడ్‌, క్యాబేజీ, బంగాళా దుంపలను మాత్రమే తీసుకుంటూ నెలలతరబడి జీవించింది. అంతేకాదు కొద్ది ఆహారం మనిషి జీవించడానికి సరిపోతుందని రుజువు చేయడానికి ఆమె రోజూ సమీపంలోని కొండలను కూడా ఎక్కి వచ్చేది. దాంతో కొద్ది నెలల తర్వాత బ్రిటన్‌ ఆమె శ్రమను గుర్తించింది. విడ్డోసన్‌ తీసుకున్న ఆహారాన్ని “యుద్ధ సమయంలో ఆహారం”గా ఖరారు చేసింది.

Tags:    
Advertisement

Similar News