సామాజిక మాధ్యమాలతోనే జన జాగృతి: కేటీఆర్
సామాజిక మాధ్యమాలతోనే పాలనలో పారదర్శకత, అవినీతి తగ్గుదల జరుగుదని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే.టీ. రామారావు పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి, సుపరిపాలనకు సామాజిక మాధ్యమాల తోడ్పాటు అనే అంశంపై ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా ప్రయత్నిస్తుందని, ఈ పంచాయతీ ద్వారా పౌర సేవలు, మైక్రో ఇన్సూరెన్స్ సేవలు, అల్ట్రా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. సామాజిక […]
Advertisement
సామాజిక మాధ్యమాలతోనే పాలనలో పారదర్శకత, అవినీతి తగ్గుదల జరుగుదని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే.టీ. రామారావు పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి, సుపరిపాలనకు సామాజిక మాధ్యమాల తోడ్పాటు అనే అంశంపై ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా ప్రయత్నిస్తుందని, ఈ పంచాయతీ ద్వారా పౌర సేవలు, మైక్రో ఇన్సూరెన్స్ సేవలు, అల్ట్రా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల వినియోగం వల్లే ఉపాధి హామీ పథకం అమల్లో అవినీతిని నిర్మూలించామని, వివిధ శాఖల డేటాబేస్‌ను సమన్వయ పరిచినప్పుడే ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల అవినీతి తగ్గి, పాలనలో పారదర్శకత ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
Advertisement