నిరాహార దీక్షను రద్దు చేసుకున్న హజారే
భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుంచి నిరసన, ఒకే ర్యాంకు ఒకే పింఛన్‌పై మాజీ సైనిక అధికారుల ఆందోళనలతో కేంద్రం దిగివచ్చిన నేపథ్యంలో తాను అక్టోబర్ 2న తలపెట్టిన దీక్షను విరమిస్తున్నట్టు సామాజికవేత్త అన్నా హజారే తెలిపారు. ల్యాండ్ బిల్లు, ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గాంధీ జయంతి రోజున మరోసారి ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరాహార దీక్ష చేపట్టేందుకు హజారే సిద్ధపడి ఆమేరకు ప్రకటన చేశారు. ఈ […]
భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుంచి నిరసన, ఒకే ర్యాంకు ఒకే పింఛన్‌పై మాజీ సైనిక అధికారుల ఆందోళనలతో కేంద్రం దిగివచ్చిన నేపథ్యంలో తాను అక్టోబర్ 2న తలపెట్టిన దీక్షను విరమిస్తున్నట్టు సామాజికవేత్త అన్నా హజారే తెలిపారు. ల్యాండ్ బిల్లు, ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గాంధీ జయంతి రోజున మరోసారి ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరాహార దీక్ష చేపట్టేందుకు హజారే సిద్ధపడి ఆమేరకు ప్రకటన చేశారు. ఈ రెండు డిమాండ్లు నెరవేరడంతో అక్టోబర్ 2న తలపెట్టిన నిరాహార దీక్షను రద్దు చేసుకున్నారు. అయితే లోక్‌పాల్, లోకాయుక్తాపై తన పోరాటం కొనసాగుతుందని కేంద్రం వీటిని నియమించకపోతే ప్రత్యేక ఉద్యమం చేస్తానని ఆయన హెచ్చరించారు.