రైతు మరణాలపై నివేదికలు కోరాం: తలసాని
ఆంధ్రా పాలకులు చేసిన పాపాలను తాము మోస్తున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. రైతుల ఆత్మహత్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. రైతుల ఆత్మహత్యలపై నివేదికల కోసం కలెక్టర్లకు ఆదేశాలు పంపించామని మంత్రి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్న మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీరందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని నిర్భయంగా చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్ అని తలసాని […]
Advertisement
ఆంధ్రా పాలకులు చేసిన పాపాలను తాము మోస్తున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. రైతుల ఆత్మహత్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. రైతుల ఆత్మహత్యలపై నివేదికల కోసం కలెక్టర్లకు ఆదేశాలు పంపించామని మంత్రి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్న మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీరందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని నిర్భయంగా చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్ అని తలసాని వ్యాఖ్యానించారు. యాదాద్రిని త్వరలో ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మారబోతుందని తలసాని వివరించారు.
Advertisement