ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై కేసు నమోదు
భార్య పట్ల గృహ హింసకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై కేసు నమోదైంది. ఆయనపై భార్య ఆరోపణలు చేసిన అనంతరం, ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. అయినా ఫలితం దక్కక పోవడంతో కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో ఇదే గొడవకు సంబంధించి బెయిల్ కోసం సోమనాథ్ భారతి కోర్టుకు వెళ్లారు. అయితే కేసు నమోదు కాకుండానే బెయిల్ ఇవ్వడం తొందరపాటు అవుతుందని […]
Advertisement
భార్య పట్ల గృహ హింసకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై కేసు నమోదైంది. ఆయనపై భార్య ఆరోపణలు చేసిన అనంతరం, ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. అయినా ఫలితం దక్కక పోవడంతో కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో ఇదే గొడవకు సంబంధించి బెయిల్ కోసం సోమనాథ్ భారతి కోర్టుకు వెళ్లారు. అయితే కేసు నమోదు కాకుండానే బెయిల్ ఇవ్వడం తొందరపాటు అవుతుందని చెబుతూ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు కేసు నమోదు కావడంతో… బెయిల్ కోసం ఆయన మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
Advertisement