రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ: హరీశ్‌రావు
కాంగ్రెస్ నేతలు పదేళ్లపాటు అధికారంలో ఉండి తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని, అక్రమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, పులిచింతలపై ఏనాడు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా నేతలతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… . ప్రాజెక్టులు రీడిజైన్ చేసి భావితరాలకు నీరందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు రాద్దాంతం […]
Advertisement
కాంగ్రెస్ నేతలు పదేళ్లపాటు అధికారంలో ఉండి తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని, అక్రమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, పులిచింతలపై ఏనాడు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా నేతలతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… . ప్రాజెక్టులు రీడిజైన్ చేసి భావితరాలకు నీరందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతుందని భయపడుతున్నారు. రాజకీయ నిరుద్యోగంతో దిక్కుతోచక ధర్నాలకు దిగుతున్నారు.
Advertisement