ఏపీ రాజధానిలో సీఎం గృహప్రవేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానిలో ఏర్పాటు చేసిన నివాస గృహంలోకి సతీసమేతంగా అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో కృష్ణా నది కరకట్టను ఆనుకొని ఉన్న లింగమనేని గ్రూపునకు చెందిన అతిథి గృహాన్ని సీఎం నివాసంగా అధికారులు సర్వహంగులతో తీర్చిదిద్దారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నేరుగా రోడ్డు మార్గంలో ఈ ఇంటికి చేరుకున్నారు. ఇకపై విజయవాడలో ఉన్నన్ని రోజులూ ఆయన ఈ ఇంట్లోనే ఉండి అధికార కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నారు. చంద్రబాబు […]

Advertisement
Update:2015-09-07 06:42 IST
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానిలో ఏర్పాటు చేసిన నివాస గృహంలోకి సతీసమేతంగా అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో కృష్ణా నది కరకట్టను ఆనుకొని ఉన్న లింగమనేని గ్రూపునకు చెందిన అతిథి గృహాన్ని సీఎం నివాసంగా అధికారులు సర్వహంగులతో తీర్చిదిద్దారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నేరుగా రోడ్డు మార్గంలో ఈ ఇంటికి చేరుకున్నారు. ఇకపై విజయవాడలో ఉన్నన్ని రోజులూ ఆయన ఈ ఇంట్లోనే ఉండి అధికార కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆగస్టు 29న పనులు జరుగుతుండగానే మంచి రోజు అన్న ఉద్దేశంతో ఈ ఇంట్లో పాలు పొంగించిన గృహ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సీఎం దంపతులు ఈ ఇంట్లోకి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంట్లో అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Tags:    
Advertisement

Similar News