బ్యాంకర్ల తీరుపై మంత్రి పోచారం ఆగ్రహం
రైతులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా ప్రభుత్వానికి బ్యాంకర్లు సహకరించడం లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయేడాది రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశామని, నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా వడ్డీసహా చెల్లిస్తామని చెప్పామని, ఒప్పందంలో చెప్పిందే ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని బ్యాంకర్లు ఎందుకు అమలు చేయడం లేదు? అనుకున్న ప్రకారంగా ఆదేశాలు ఎందుకు జారీ చేయడం లేదు.? కింది స్థాయి అధికారులను ఎందుకు ఆదేశించడం లేదు. వడ్డీతో […]
Advertisement
రైతులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా ప్రభుత్వానికి బ్యాంకర్లు సహకరించడం లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయేడాది రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశామని, నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా వడ్డీసహా చెల్లిస్తామని చెప్పామని, ఒప్పందంలో చెప్పిందే ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని బ్యాంకర్లు ఎందుకు అమలు చేయడం లేదు? అనుకున్న ప్రకారంగా ఆదేశాలు ఎందుకు జారీ చేయడం లేదు.? కింది స్థాయి అధికారులను ఎందుకు ఆదేశించడం లేదు. వడ్డీతో సహా చెల్లిస్తామని జీవో 323 విడుదల చేశాం గదా? ఇది ప్రభుత్వమనుకుంటున్నారా? లేక ప్రైవేటు రంగమా? మేం ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. ఏం సమాధానం చెప్పాలి’ అని మంత్రి పోచారం బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బిసి) శుక్రవారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎస్‌బిహెచ్ సిజిఎం సాంతాను ముఖర్జీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ రెండో విడత రుణమాఫీ నిధులు రూ.4250 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అయినా కొన్ని బ్యాంకులు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలను బ్యాంకర్లు అమలు చేయాలని, ఇబ్బందులేమైనా ఉంటే తమకు తెలియజేయాలని ఆయన కోరారు.
Advertisement