కేవీపీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
వైఎస్ రాజశేఖర్ చిత్రపటానికి సంబంధించి స్పీకర్‌కు రాసిన లేఖలో స్పీకర్, సభపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేవీపీ రామచంద్రరావుపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి అసెంబ్లీలో వైఎస్ చిత్రపటాన్ని పెట్టడం అనేది సభా హక్కుల ఉల్లంఘనే అని టీడీపీ ఎమ్మెల్యే అనిత తెలిపారు. అలాగే స్పీకర్ అనుమతి లేకుండా సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ చిత్రపటాన్ని పెట్టడంపై సెక్షన్ 168 కింది సభా ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటివి […]
Advertisement
వైఎస్ రాజశేఖర్ చిత్రపటానికి సంబంధించి స్పీకర్‌కు రాసిన లేఖలో స్పీకర్, సభపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేవీపీ రామచంద్రరావుపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి అసెంబ్లీలో వైఎస్ చిత్రపటాన్ని పెట్టడం అనేది సభా హక్కుల ఉల్లంఘనే అని టీడీపీ ఎమ్మెల్యే అనిత తెలిపారు. అలాగే స్పీకర్ అనుమతి లేకుండా సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ చిత్రపటాన్ని పెట్టడంపై సెక్షన్ 168 కింది సభా ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటివి పునావృతం కాకుండా ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ టీడీపీ నోటీసుపై ప్రివిలేజ్ కమిటీకి పంపుతామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
వైఎస్ చిత్రపటం… స్పీకర్‌కు కేవీపీ లేఖపై దుమారం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రపటాన్ని అసెంబ్లీ లాబీలో తిరిగి ఏర్పాటు చేసే విషయమై స్పీకర్ కోడెలకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖలోని అంశాలపై సభలో దుమారం చెలరేగింది. లేఖలోని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ స్పీకర్ కోడెల… అసెంబ్లీలో వాటిని చదివి వినిపించారు. ‘దీనిని మీరు అంగీకరిస్తారా?’ అంటూ సభను ప్రశ్నించగా… అందుకు సభ్యులు వ్యతిరేకించారు. అయితే, సభాధ్యక్ష స్థానంలో ఉండి స్పీకర్ వ్యవహరించిన తీరుపై కేవీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు మరో లేఖ రాశారు. దీన్ని మీడియాకు విడుదల చేశారు. లేఖలో రెండు మూడు వాక్యాలు మాత్రమే చదవి సభను ప్రశ్నించడం తనను అవమానించడమేనని తప్పుబట్టారు. లేఖల్లో అభ్యంతరకరమైన అంశాలు తెలిపితే వివరణ ఇస్తానని చెప్పారు. కాగా దురుద్దేశాలను ఆపాదిస్తూ స్పీకర్‌కు కేవీపీ రాసిన లేఖ సభా హక్కుల ఉల్లంఘన కింద పరిగణించవచ్చని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సభలో సభ్యుడు కాని కేవీపీని ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలిపించవచ్చన్నారు. కేవీపీ రాసిన లేఖపై ఆయన కమిటీ ముందుకు వచ్చి, వివరణ ఇచ్చి.. క్షమాపణ చెబితే వివాదం సద్దుమణుగుతుందని, లేకపోతే జైలుకు పంపించే అధికారం కూడా స్పీకర్‌కు ఉందని వివరించారు. యనమల ప్రకటన అయిన తర్వాత సభ తీవ్ర గందరగోళం మద్య వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కేవీపీ రామచంద్రరావుపై సభా హక్కుల ఉట్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు.
Advertisement