తల్లిని చూసేందుకు కోర్టుకు "షీనా" సోదరి...
షీనా బోరా హత్యలో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి మరో కూతురు విధి నిన్న మీడియాకు కనిపించింది. తన తల్లిని చూసేందుకు కోర్టుకు వచ్చిన ఆమె ఇంద్రాణిని చూడగానే బోరున విలపించింది. విధికి ఆస్తి రాస్తిస్తానని ఇంద్రాణి తన రెండో భర్త సంజీవ్ ఖన్నాకు మాటివ్వడంతోనే అతను షీనా బోరా హత్యలో పాల్గొన్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విధి ఎవరు? ఎలా ఉంటుంది? ఎంత వయసు? అన్న ప్రశ్నలకు నిన్నటితో తెరపడింది. కస్టడీ పొడగింపు..! […]
Advertisement
షీనా బోరా హత్యలో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి మరో కూతురు విధి నిన్న మీడియాకు కనిపించింది. తన తల్లిని చూసేందుకు కోర్టుకు వచ్చిన ఆమె ఇంద్రాణిని చూడగానే బోరున విలపించింది. విధికి ఆస్తి రాస్తిస్తానని ఇంద్రాణి తన రెండో భర్త సంజీవ్ ఖన్నాకు మాటివ్వడంతోనే అతను షీనా బోరా హత్యలో పాల్గొన్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విధి ఎవరు? ఎలా ఉంటుంది? ఎంత వయసు? అన్న ప్రశ్నలకు నిన్నటితో తెరపడింది.
కస్టడీ పొడగింపు..!
ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణి ముఖర్జియా, సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్‌రాయ్‌ల పోలీస్ కస్టడీ ముగియడంతో వారిని పోలీసులు సోమవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్‌ఎం చాంద్‌గాడే ఎదుట హాజరుపరిచారు. షీనా సోదరుడు మిఖాయిల్‌ను కూడా ఇంద్రాణి విషప్రయోగం చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ పోలీసులు ఆమెపై హత్యాయత్నం అభియోగం మోపారు. దీంతో కోర్టు నిందితుల కస్టడీని సెప్టెంబరు 5 వరకు పొడగించారు.
మొండికేస్తోంది..!
లాయర్లను కలిసిన తరువాత ఇంద్రాణి ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలు పోలీసులకు విచారణలో సహకరించకపోవడానికి అదే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దీనికితోడు కోర్టువిచారణకు రావడంతో నిందితుల లాయర్లు తమ క్లయింట్లను పోలీసులు కొడుతున్నారని, నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వాదించారు. కేసులో 90 గంటలపాటు విచారణ సాగింది కాబట్టి వీరి కస్టడీ పొడగించాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో మహారాష్ట్ర అవతల వ్యక్తుల ప్రమేయంపై దృష్టి సారించారు.
కిరాయి హంతకులను పెట్టిందా?
మిఖాయిల్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించడంతో ఇంద్రాణిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందుకోసం ఎవరినన్నా కిరాయి హంతకులను నియమించిందా? అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నారు. మరోవైపు ఇంద్రాణి మొదటి భతర్త సిద్ధార్థ దాస్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం కోల్ కతాలో ఉంటున్న ఆయన స్టేట్‌మెంట్ తీసుకోవడానికి పోలీసులు త్వరలోనే ఆయనను కలుస్తామని తెలిపారు.
Advertisement