ఒకే రోజు వందకోట్ల మంది!

సోషల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ మ‌రో రికార్డును సృష్టించింది. సోమ‌వారం ఒక్క‌రోజే ప్ర‌పంచవ్యాప్తంగా 100 కోట్ల‌మంది ఫేస్‌బుక్‌ను వినియోగించుకున్నారు. అంటే ఈ భూమి మీదున్న ప్ర‌తి ఏడుగురిలో ఒక‌రు ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని అరుదైన రికార్డు నెల‌కొల్పారు. 2004 నుంచి ఇప్పటి వరకు ఫేస్‌బుక్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు వందకోట్ల మంది యూజర్లు లాగిన్ అయ్యారని కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ ప్ర‌క‌టించారు. ప్రతి నెల 150 కోట్లమంది మంది ఫేస్‌బుక్‌లో లాగిన్ అవుతారని, గత […]

Advertisement
Update:2015-08-29 06:23 IST
సోషల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ మ‌రో రికార్డును సృష్టించింది. సోమ‌వారం ఒక్క‌రోజే ప్ర‌పంచవ్యాప్తంగా 100 కోట్ల‌మంది ఫేస్‌బుక్‌ను వినియోగించుకున్నారు. అంటే ఈ భూమి మీదున్న ప్ర‌తి ఏడుగురిలో ఒక‌రు ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని అరుదైన రికార్డు నెల‌కొల్పారు.
2004 నుంచి ఇప్పటి వరకు ఫేస్‌బుక్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు వందకోట్ల మంది యూజర్లు లాగిన్ అయ్యారని కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ ప్ర‌క‌టించారు. ప్రతి నెల 150 కోట్లమంది మంది ఫేస్‌బుక్‌లో లాగిన్ అవుతారని, గత అక్టోబర్‌లో తొలిసారి 100 కోట్ల యూజర్ మార్క్‌ను చేరుకున్నామని పేర్కొన్నారు. త‌మ నెట్‌వ‌ర్క్ ఈ రికార్డు సాధించేందుకు కృషి చేసిన ప్ర‌తి వినియోగ‌దారుడికి జుక‌ర్‌బ‌ర్గ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News