'మీ నాయన మాదిరిగా ఉన్నావమ్మా'
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో షర్మిల చేస్తున్న పరామర్శయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఏడు కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దివంగత మహానేత తనయ వస్తోందని తెలుసుకున్న ప్రజలు ఆమెను చూసేందుకు రోడ్లకిరువైపులా బారులు తీరి నిలబడ్డారు. షర్మిలను ఆత్మీయంగా పలకరించారు. మీ నాయన చేసిన మేలును ఎన్ని జన్మలెత్తినా మరిచిపోలేం తల్లీ… నిన్ను చూస్తే రాజన్నను చూసినట్లే ఉందని ఉద్వేగంతో కన్నీళ్ల మధ్య చెప్పారు. వారి ఆత్మీయతను […]
Advertisement
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో షర్మిల చేస్తున్న పరామర్శయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఏడు కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దివంగత మహానేత తనయ వస్తోందని తెలుసుకున్న ప్రజలు ఆమెను చూసేందుకు రోడ్లకిరువైపులా బారులు తీరి నిలబడ్డారు. షర్మిలను ఆత్మీయంగా పలకరించారు. మీ నాయన చేసిన మేలును ఎన్ని జన్మలెత్తినా మరిచిపోలేం తల్లీ… నిన్ను చూస్తే రాజన్నను చూసినట్లే ఉందని ఉద్వేగంతో కన్నీళ్ల మధ్య చెప్పారు. వారి ఆత్మీయతను చూసి షర్మిల చలించిపోయారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి నిరంతరం ప్రజల క్షేమం కోసమే పని చేసారని, తండ్రి బాటలోనే అన్న జగన్ కూడా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు.
Advertisement