ఎస్టీ జాబితాలోకి త్వరలో ఖైతీ లంబాడీలు, వాల్మీకి బోయలు
ఖైతీ లంబాడీలు, వాల్మీకి బోయలకు త్వరలో ఎస్టీ రిజర్వేషన్ హోదా దక్కనుంది. ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని త్వరలో వారిని ఎస్టీల జాబితాలో చేర్చడంతో పాటు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎన్.చెల్లప్ప మంగళవారం భువనగిరిలో జరిగిన గిరిజన సంఘాల నేతల సమావేశంలో వెల్లడించారు. 2011 గిరిజన జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం ఈ రిజర్వేషన్ కల్పించనుందని ఆయన చెప్పారు. అనంతరం తెలంగాణ గిరిజన ఐక్యకార్యాచరణ కమిటీ నేత […]
Advertisement
ఖైతీ లంబాడీలు, వాల్మీకి బోయలకు త్వరలో ఎస్టీ రిజర్వేషన్ హోదా దక్కనుంది. ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని త్వరలో వారిని ఎస్టీల జాబితాలో చేర్చడంతో పాటు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎన్.చెల్లప్ప మంగళవారం భువనగిరిలో జరిగిన గిరిజన సంఘాల నేతల సమావేశంలో వెల్లడించారు. 2011 గిరిజన జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం ఈ రిజర్వేషన్ కల్పించనుందని ఆయన చెప్పారు. అనంతరం తెలంగాణ గిరిజన ఐక్యకార్యాచరణ కమిటీ నేత ధారావత్ రవినాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా గిరిజనులకు రిజర్వేషన్‌లు కల్పించిన తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎస్టీసెల్ జాతీయ కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించకుండా ప్రభుత్వం లక్షా 7 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
Advertisement