ప్రాణహిత పనుల వేగం పెంచండి: సీఎం
డిజైన్ మార్పుల కారణంగా మూలన పడిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను ఇకపై వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఐదు నెలలుగా ఆగిపోయిన ప్రాజెక్టు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గతంలో ప్రతిపాదించినట్లుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ దిగువన ఎల్లంపల్లి పనులతోపాటు దిగువ ప్యాకేజీ పనులను కూడా తిరిగి ప్రారంబించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై సందిగ్ధత కొనసాగుతున్నందున స్పష్టత వచ్చేవరకు ఆ పనులను ఆపేయాలని మిగిలిన పనులు యధాతధంగా చేపట్టాలని […]
Advertisement
డిజైన్ మార్పుల కారణంగా మూలన పడిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను ఇకపై వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఐదు నెలలుగా ఆగిపోయిన ప్రాజెక్టు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గతంలో ప్రతిపాదించినట్లుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ దిగువన ఎల్లంపల్లి పనులతోపాటు దిగువ ప్యాకేజీ పనులను కూడా తిరిగి ప్రారంబించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై సందిగ్ధత కొనసాగుతున్నందున స్పష్టత వచ్చేవరకు ఆ పనులను ఆపేయాలని మిగిలిన పనులు యధాతధంగా చేపట్టాలని ఆయన సూచించారు. దీంతో కాంట్రాక్టర్లు ఒకటి రెండు రోజుల్లో పనులు ప్రారంభించనున్నారు.
Advertisement