అనంతపురంలో ఘోర రైలు ప్రమాదం: ఆరుగురి మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుకొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. లెవల్ క్రాసింగ్ కావడం, లారీ బ్రేకులు ఫెయిలవ్వడంతో పట్టాల మీదకు దూసుకువచ్చి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ హెచ్-1 బోగీని […]
Advertisement
అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుకొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. లెవల్ క్రాసింగ్ కావడం, లారీ బ్రేకులు ఫెయిలవ్వడంతో పట్టాల మీదకు దూసుకువచ్చి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ హెచ్-1 బోగీని ఢీకొట్టింది. లారీ ఎగిరిపడటంతో గ్రానైట్ రాళ్లు బోగీపై పడి నుజ్జునుజ్జు అయింది. మరోరెండు బోగీలు ఒత్తుకుపోయాయి. ఈఘటనతో ఏం జరుగుతుందో అర్థఃంకాక ప్రయాణికులు హాహాకారాలు చేయసాగారు. మృతుల్లో రాయచూర్ జిల్లా దేవ్‌దుర్గ్ ఎమ్మెల్యే వెంకటేశ్ నాయక్, ఇండోఫిల్ ఇండస్ట్రీస్ జీఎం రాజు, పుల్లారావు (రాయచూర్), సయ్యద్ అహ్మద్ (ఏసీబోగీ టెక్నీషియన్) లారీ క్లీనర్ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని బెంగళూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రిలో చేర్పించారు. రైల్వే పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయం, హైల్ప్‌లైన్ ఏర్పాటు!
ప్రమాదంతో ఈ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాదం తరువాత అనంపురంలో రాజధాని ఎక్స్‌ప్రెస్, గార్లె దిన్నెలో బీదర్ ఎక్స్‌ప్రెస్, కల్లూరులో సోలాపూర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. ఈ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు రైల్వే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. పెనుకొండ:24, 08559-222555, అనంతపురం: 08554-236444 హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రందించాలని రైల్వే అధికారులు సూచించారు.
Advertisement