ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలి: ప్రధాని
ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు జరగాలని ప్రధాని మోడీ కోరారు. యుఎన్ఓ ఏర్పడి 70వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా సంస్కరణలను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ఆయన అన్నారు. భారత్-పసిఫిక్ ద్వీప దేశాల రెండో సదస్సును జైపూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ ధరకు సాంకేతిక పరిజ్ఞానం, తగిన విధంగా నిధుల కేటాయింపు లేకపోతే కర్బన ఉద్గారాల తగ్గింపు కేవలం కలగా మిగిలిపోతుందన్నారు. పారిస్‌లో జరగనున్నవాతావరణ మార్పు అంతర్జాతీయ సదస్సులో […]
Advertisement
ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు జరగాలని ప్రధాని మోడీ కోరారు. యుఎన్ఓ ఏర్పడి 70వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా సంస్కరణలను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ఆయన అన్నారు. భారత్-పసిఫిక్ ద్వీప దేశాల రెండో సదస్సును జైపూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ ధరకు సాంకేతిక పరిజ్ఞానం, తగిన విధంగా నిధుల కేటాయింపు లేకపోతే కర్బన ఉద్గారాల తగ్గింపు కేవలం కలగా మిగిలిపోతుందన్నారు. పారిస్‌లో జరగనున్నవాతావరణ మార్పు అంతర్జాతీయ సదస్సులో ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 14 పసిఫిక్ దేశాల అవసరాల కోసం ఢిల్లీలో భవనం కేటాయిస్తున్నామని ఆయన ప్రకటించారు. పసిఫిక్ దేశాల్లోని ఏదో ఒక దేశంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
Advertisement