స్మితాసబర్వాల్ కేసుకు తెలంగాణ సర్కారు నిధులు!
ఔట్‌లుక్ మ్యాగజైన్ కవర్‌పేజీపై అసభ్యకరంగా కార్టూన్‌ను ప్రచురించిన కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కేసుకు అయ్యే ఖర్చుల కింద రూ.15 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. స్మితాసబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ గతంలో మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌పై కోర్టులో రూ. 10 కోట్లకు దావా వేసిన విషయం విదితమే. ఈ విషయంలో స్మితాసబర్వాల్ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన ఔట్‌లుక్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు […]
Advertisement
ఔట్‌లుక్ మ్యాగజైన్ కవర్‌పేజీపై అసభ్యకరంగా కార్టూన్‌ను ప్రచురించిన కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కేసుకు అయ్యే ఖర్చుల కింద రూ.15 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. స్మితాసబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ గతంలో మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌పై కోర్టులో రూ. 10 కోట్లకు దావా వేసిన విషయం విదితమే. ఈ విషయంలో స్మితాసబర్వాల్ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన ఔట్‌లుక్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే! నోటీసులు అందుకున్నా.. ఆ పత్రిక ఈ విషయంలో ఎలాంటి విచారం వ్యక్తం చేయకపోవడం దురదృష్టకరం. అనంతరం స్మితాసబర్వాల్ భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ సీసీఎస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈకేసుకు సంబంధించి కోర్టులో లాయర్లు, ఇతర ఖర్చులకు గాను స్మితాసబర్వాల్‌కు తెలంగాణ సర్కారు బాసటగా నిలిచి ఈ నిధులు మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో స్మితాసబర్వాల్ లాంటి నిజాయితీపరురాలైన అధికారిణిమీద ఔట్‌లుక్ ప్రచురించిన కార్టూన్‌పై తెలంగాణాపౌరులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసారు. సోషల్‌మీడియాలో అయితే ఆ వార్త రాసిన మాధవిటాటా మీద నెట్‌జెన్‌లు విరుచుకుపడ్డారు. కొంతమంది సంయమనం తప్పి మాధవిటాటాను అసభ్యంగా దూషించారు కూడా! సోషల్‌మీడియాలో వచ్చిన నిరసనలకు భయపడ్డ ఔట్‌లుక్ యాజమాన్యం గవర్నర్‌కు ఫిర్యాదుచేసింది. ఒక రాజకీయపార్టీకి తొత్తుగా వ్యవహరించే మాధవిటాటాకు ఒక నిజాయితీపరురాలైన అధికారిణిని విమర్శించే హక్కు ఎక్కడవుందని సోషల్‌మీడియాలో వందలాదిమంది ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఔట్‌లుక్ యాజమాన్యం కూడా ఆలోచల్లోపడింది.
Advertisement