రైల్వే కారిడార్ల‌కు స‌మాంత‌రంగా ఫ్లై ఓవ‌ర్లు 

మెట్రో రైలు నిర్మాణం వ‌ల్ల న‌గ‌ర వాసులు ప‌లు చోట్ల తీవ్ర‌మైన ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌ను నివారించేందుకు మెట్రో కారిడార్‌కు స‌మాంత‌రంగా ఫ్లై ఓవ‌ర్లు నిర్మించాల‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అందులో భాగంగా మెట్రో ప్ర‌ధాన కారిడార్ మియాపూర్, ఎల్బీ న‌గ‌ర్ మార్గంలో 8 చోట్ల ఫ్లై ఓవ‌ర్లు నిర్మించాల‌ని ఉన్న‌తాధికారులు నిర్ణ‌యించారు. అందుకోసం రూ. 300 కోట్ల‌ను జాతీయ ర‌హ‌దారుల విభాగానికి మెట్రో  రైలు ప్రాజెక్టు సంస్థ చెల్లించాల‌ని వారు సూచించారు. ప‌నులు […]

Advertisement
Update:2015-08-19 18:46 IST
మెట్రో రైలు నిర్మాణం వ‌ల్ల న‌గ‌ర వాసులు ప‌లు చోట్ల తీవ్ర‌మైన ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌ను నివారించేందుకు మెట్రో కారిడార్‌కు స‌మాంత‌రంగా ఫ్లై ఓవ‌ర్లు నిర్మించాల‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అందులో భాగంగా మెట్రో ప్ర‌ధాన కారిడార్ మియాపూర్, ఎల్బీ న‌గ‌ర్ మార్గంలో 8 చోట్ల ఫ్లై ఓవ‌ర్లు నిర్మించాల‌ని ఉన్న‌తాధికారులు నిర్ణ‌యించారు. అందుకోసం రూ. 300 కోట్ల‌ను జాతీయ ర‌హ‌దారుల విభాగానికి మెట్రో రైలు ప్రాజెక్టు సంస్థ చెల్లించాల‌ని వారు సూచించారు. ప‌నులు ప్రారంభించేందుకు రోడ్లు, జీహెచ్ఎంసీ, మెట్రో, ట్రాఫిక్ అధికారులు ఈనెల 26న సంయుక్తంగా ప‌ర్య‌టించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని అధికారులు సూచించారు. ఈ స‌మావేశంలో రోడ్లు, జీహెచ్ఎంసీ, మెట్రో, ట్రాఫిక్ పోలీస్ విభాగాల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
Tags:    
Advertisement

Similar News