ఛత్తీస్‌గఢ్ విద్యుత్ భారం
తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడంతోపాటు మరో వెయ్యి మెగావాట్లను కూడా కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం భవిష్యత్‌లో రాష్ట్రానికి ఆర్థికభారం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే ప్రభుత్వం విద్యుత్ కొరతను అధిగమించడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్లు వేయాలని భావించినప్పటికీ రూ.3 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని వెనకడుగు వేసింది. ఆ తర్వాత సొంతలైన్లకు బదులు కేంద్ర ప్రభుత్వ సంస్థ […]
Advertisement
తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడంతోపాటు మరో వెయ్యి మెగావాట్లను కూడా కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం భవిష్యత్‌లో రాష్ట్రానికి ఆర్థికభారం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే ప్రభుత్వం విద్యుత్ కొరతను అధిగమించడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్లు వేయాలని భావించినప్పటికీ రూ.3 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని వెనకడుగు వేసింది. ఆ తర్వాత సొంతలైన్లకు బదులు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లిమిటెడ్ నిర్మిస్తున్న వార్దా- డిచ్‌పల్లి -మహేశ్వరం లైన్ల ద్వారా చత్తీస్ గఢ్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ లైన్ పూర్తి అయ్యేందుకు రెండున్నరేళ్లకు పైగా సమయం పడుతుంది. అంతేకాకుండా ఈ లైన్ ద్వారా తెలంగాణకు మొదటి కేటాయింపులు ఉంటాయో, లేదో తెలియదు. అందుకు కారణం తెలంగాణ కంటే ముందే చత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం తమిళనాడు దరఖాస్తు చేసుకుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో టీ. ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను మాత్రమే కొనుగోలు చేయాలనుకోవడం అది కూడా కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా కొనుగోలు చేయడం అనవసరమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ ధర రూ. 5 పైనే ఉండవచ్చు. దీనివల్ల విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఛత్తీస్‌గఢ్‌కు బదులుగా ఉత్తరాది విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ తక్కువ ధరకు లభిస్తుందని, వార్దా డిచ్‌పల్లి మహేశ్వరం లైన్ల ద్వారా కారిడార్ లభ్యత కూడా లభిస్తోందని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
Advertisement