ప్రణాళిక లేక రూ.7426 కోట్ల నిధులు వృధా

తెలంగాణ సర్కారు ఘనకార్యం… ఎస్సీ, ఎస్టీలకు శాపం ఒకపక్క నిధులు లేవని నంగనాసి కబుర్లు చెప్పే ప్రభుత్వాలకు ఉన్న నిధులను కూడా ఖర్చు చేయడం చేత కావడం లేదు. నిధులు సాధించుకోవడం మీద ఉన్న యావ వాటిని సకాలంలో సమర్ధంగా ఖర్చు చేసే చిత్తశుద్ధి ఉండడం లేదు. నిధుల కోసం ఒక రాష్ట్రానికి మించి మరో రాష్ట్రం పోటీ పడుతుంటాయి. తీరా కేటాయించిన నిధులను వినియోగించడంలో మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా లబ్దిదారులకు అందాల్సిన పథకాలు […]

Advertisement
Update:2015-08-19 05:41 IST
తెలంగాణ సర్కారు ఘనకార్యం… ఎస్సీ, ఎస్టీలకు శాపం
ఒకపక్క నిధులు లేవని నంగనాసి కబుర్లు చెప్పే ప్రభుత్వాలకు ఉన్న నిధులను కూడా ఖర్చు చేయడం చేత కావడం లేదు. నిధులు సాధించుకోవడం మీద ఉన్న యావ వాటిని సకాలంలో సమర్ధంగా ఖర్చు చేసే చిత్తశుద్ధి ఉండడం లేదు. నిధుల కోసం ఒక రాష్ట్రానికి మించి మరో రాష్ట్రం పోటీ పడుతుంటాయి. తీరా కేటాయించిన నిధులను వినియోగించడంలో మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా లబ్దిదారులకు అందాల్సిన పథకాలు అటకెక్కుతున్నాయి. ప్రభుత్వాలు తీర్చాల్సిన అవసరాలు అలాగే మిగిలిపోతున్నాయి. తమకు నిధులు కావాలని డిమాండు చేసే వారు కూడా తర్వాత ప్రభుత్వాల మీద ఒత్తిడి తేకపోవడంతో నిధులకు కాలం చెల్లి ఎవరికీ పనికి రాకుండా పోతున్నాయి. ద‌ళిత‌, గిరిజ‌న ఉప ప్ర‌ణాళిక కింద గ‌త ఏడాది కేటాయించిన నిధులు తెలంగాణ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయ‌లేక పోవ‌డంతో అక్ష‌రాల రూ.7,426 కోట్లు మురిగి పోయాయి. ఈ నిధులు వ‌చ్చే ఏడాదికి బ‌దిలీ కావ‌ని ప్ర‌భుత్వాధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఖ‌ర్చుచేయాల్సిన వేల కోట్ల రూపాయ‌లు మురిగి పోయాయి. 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎస్టీ ఉప ప్ర‌ణాళిక కింద రూ.7500 కోట్లు, ఎస్టీ ఉప ప్ర‌ణాళిక కింద రూ. 4500 కోట్ల‌ను మొత్తం 12 వేల కోట్లను ప్ర‌భుత్వం కేటాయించింది. ఈ నిధుల నుంచి కేవ‌లం రూ. 4 వేల 574 కోట్ల‌ను మాత్ర‌మే ప్ర‌భుత్వం ఎస్సీ ఎస్టీల‌కు ఖ‌ర్చు చేసింది. దీంతో మిగిలిన నిధుల‌న్నీ మురిగి పోయాయి. ఈ ఏడాది ఎస్టీ ఉప‌ ప్ర‌ణాళిక‌కు రూ. 8089 కోట్లు, ఎస్సీ ఉప ప్ర‌ణాళిక‌కు రూ. 5035 కోట్లు కేటాయించింది. ఈ నిధుల‌ను కూడా స‌కాలంలో ఖ‌ర్చు పెట్ట‌కుంటే మురిగి పోతాయ‌ని సంక్షేమ‌శాఖ అధికారులు చెబుతున్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే లోపాలమయంగా ఉన్న ఎస్టీ, ఎస్సీ ఉప ప్రణాళికకు సవరణలు చేస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్‌ వాగ్దానం చేసినా ఆ దిశగా ఏమీ ప్రయత్నాలు సాగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి యేడాదిన్నర గడిచినా ఇంతవరకు అసెంబ్లీలో ఆ విషయమే ప్రస్తావనకు రాలేదు. ప్రధానంగా ఉప ప్రణాళిక నిధులు మురిగి పోకుండా ఉండేందుకు తగిన విధంగా సవరణలు చేస్తామన్న హామీ కూడా కొండెక్కింది. ఇప్పటికైనా మేల్కొని సవరణలకు పూనుకోకపోతే రానున్న కాలంలో కూడా నిధులు మురిగిపోవడం ఖాయం.
Tags:    
Advertisement

Similar News