నిధుల్లేని గ్రామజ్యోతి దండగ: ఎర్రబెల్లి
గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకుండా గ్రామజ్యోతి పథకం అమలు చేయడం దండగని టీ.టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి పథకం కింద గ్రామానికి రూ. 2 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించి, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విమర్శించారు. దసరా, బోనాల పండుగలకు కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నమ్మి సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు చేస్తే, […]
Advertisement
గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకుండా గ్రామజ్యోతి పథకం అమలు చేయడం దండగని టీ.టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి పథకం కింద గ్రామానికి రూ. 2 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించి, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విమర్శించారు. దసరా, బోనాల పండుగలకు కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నమ్మి సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు చేస్తే, సీఎం వారికి మొండి చెయ్యి చూపారని ఎర్రబెల్లి ఆరోపించారు. వరంగల్ జిల్లాలో ఏడుసార్లు పర్యటించిన సీఎం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, వరంగల్ చుట్టు రింగ్‌రోడ్డు, టెక్స్‌టైల్ పార్క్‌లకు అతీగతీ లేదని ఆయన విమర్శించారు. కంతనపల్లి ప్రాజెక్టుతోపాటు ప్రాణహిత ప్రాజెక్టును కూడా ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని, ప్రాజెక్టుల రద్దుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
Advertisement