బీబీనగర్‌కు త్వరలో ఎయిమ్స్ స్థల పరిశీలకులు
ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను బీబీనగర్‌లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆస్పత్రి కోసం 200 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. అయితే, పరిశీలన కోసం కేంద్ర బృందం రావడం ఆలస్యమవుతున్న నేపధ్యంలో రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాను కలిశారు. వారిద్దరూ తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో స్థల […]
Advertisement
ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను బీబీనగర్‌లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆస్పత్రి కోసం 200 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. అయితే, పరిశీలన కోసం కేంద్ర బృందం రావడం ఆలస్యమవుతున్న నేపధ్యంలో రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాను కలిశారు. వారిద్దరూ తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో స్థల పరిశీలనకు ఓ బృందాన్ని పంపుతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.
Advertisement