అశ్లీల వెబ్ సైట్ల బ్లాక్‌కు ఎయిర్ టెల్, ఎంటీఎస్ మెలిక!
అశ్లీల వెబ్ సైట్లను బ్లాక్ చేయడానికి ఎంటీఎస్, ఎయిర్‌టెల్ సంస్థలు మెలిక పెట్టాయి. వీటిని బ్లాక్ చేయాలంటే, తమకు లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలని ఈ సంస్థలు పేర్కొనట్టు తెలుస్తోంది. బ్లాక్ చేసిన సైట్లు కొన్ని కొత్త ఐపీ సంఖ్య, కొత్త పేరుతో తిరిగి వస్తున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కేంద్రానికి తెలియజేయడంతో, వీటిని కనిపెట్టేందుకు నిఘా విభాగం రంగంలోకి దిగింది. కాగా లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలంటే చట్ట పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు […]
Advertisement
అశ్లీల వెబ్ సైట్లను బ్లాక్ చేయడానికి ఎంటీఎస్, ఎయిర్‌టెల్ సంస్థలు మెలిక పెట్టాయి. వీటిని బ్లాక్ చేయాలంటే, తమకు లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలని ఈ సంస్థలు పేర్కొనట్టు తెలుస్తోంది. బ్లాక్ చేసిన సైట్లు కొన్ని కొత్త ఐపీ సంఖ్య, కొత్త పేరుతో తిరిగి వస్తున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కేంద్రానికి తెలియజేయడంతో, వీటిని కనిపెట్టేందుకు నిఘా విభాగం రంగంలోకి దిగింది. కాగా లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలంటే చట్ట పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశ్లీల వెబ్ సైట్లను నిషేధిస్తే, వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లవుతుందని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేయడమే ఇందుకు కారణం. దీంతో కేంద్రం ఏం చేయాలనే అంశంలో ఆచితూచి వ్యవహరించదలచినట్టు తెలుస్తోంది
Advertisement