పనులు ప్రారంభించని టెక్స్‌టైల్ యూనిట్ల అనుమతి రద్దు
మెదక్ జిల్లా పాశమైలారం టెక్స్‌టైల్ పార్కులో ప్లాట్లు కేటాయించినా పనులు ప్రారంభించని యూనిట్లకు అనుమతులు రద్దు కానున్నాయి. ఆగస్టు 21 లోగా పార్కు స్థితిగతులను ప్రభుత్వం అధ్యయనం చేసి పనులు మొదలు పెట్టని సంస్థలకు అనుమతి రద్దు చేయనుంది. ఆసక్తి ఉన్న వ్యాపారులకు ఆ ప్లాట్లను కేటాయించనుంది. పార్కు స్థితిగతులపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, హరీశ్‌రావులు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2012లో 45 యూనిట్లకు అనుమతి మంజూరు చేసినా కేవలం 15 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి […]
Advertisement
మెదక్ జిల్లా పాశమైలారం టెక్స్‌టైల్ పార్కులో ప్లాట్లు కేటాయించినా పనులు ప్రారంభించని యూనిట్లకు అనుమతులు రద్దు కానున్నాయి. ఆగస్టు 21 లోగా పార్కు స్థితిగతులను ప్రభుత్వం అధ్యయనం చేసి పనులు మొదలు పెట్టని సంస్థలకు అనుమతి రద్దు చేయనుంది. ఆసక్తి ఉన్న వ్యాపారులకు ఆ ప్లాట్లను కేటాయించనుంది. పార్కు స్థితిగతులపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, హరీశ్‌రావులు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2012లో 45 యూనిట్లకు అనుమతి మంజూరు చేసినా కేవలం 15 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి ప్రారంభించాయి. వాటిలో 7 మాత్రమే పని చేస్తున్నాయి. దీంతో ఉత్పత్తి ప్రారంభించని పరిశ్రమల అనుమతి రద్దు చేయాలని మంత్రులు నిర్ణయించారు.
Advertisement