హైదరాబాద్‌లో పోలీస్ ట్విన్ టవర్స్
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో 8 ఎకరాల సువిశాలమైన స్థలంలో పోలీస్ ట్విన్ టవర్స్ నిర్మించాలని సంకల్పించారు. ఆ భవనాలు పోలీస్ వ్యవస్థకే మకుటాయమానంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో ప్రపంపవ్యాప్తంగా పేరొందిన 15 అంతర్జాతీయ కంపెనీలు ట్విన్ టవర్స్ నమూనాలను పంపాయి. శనివారం అధికారులతో కలిసి వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి ఒకటి 20 అంతస్తులు, మరోటి […]
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో 8 ఎకరాల సువిశాలమైన స్థలంలో పోలీస్ ట్విన్ టవర్స్ నిర్మించాలని సంకల్పించారు. ఆ భవనాలు పోలీస్ వ్యవస్థకే మకుటాయమానంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో ప్రపంపవ్యాప్తంగా పేరొందిన 15 అంతర్జాతీయ కంపెనీలు ట్విన్ టవర్స్ నమూనాలను పంపాయి. శనివారం అధికారులతో కలిసి వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి ఒకటి 20 అంతస్తులు, మరోటి 16 అంతస్తులన్న రెండు టవర్ల అద్దాల భవనం నమూనాను ఆమోదించారు. లాండ్‌స్కేపింగ్, వాటర్ ఫౌంటెన్స్ మధ్య ఠీవిగా తలెత్తుకుని ఉండే ఈ జంటహర్మ్యాల సముదాయంపై హెలిపాడ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. నగరంలోని వేర్వేరు కూడళ్లలో ఉన్న లక్ష సీసీ కెమెరాలను పర్యవేక్షించే వ్యవస్థ ఇందులో ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్‌తో టవర్లపై సోలార్‌రూఫ్, సందర్శకుల కోసం భవనం ఉంటుంది. వెయ్యిమంది కూర్చునేలా ఆడిటోరియంతో పాటు 600 వాహనాలు పార్క్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ నమూనాకు తుది మెరుగులు పెట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.