మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంపు?
పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచేందుకు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది. 2006 తర్వాత మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచనందున తమకు ఆదాయం గణనీయంగా తగ్గిందని మున్సిపల్ పాలక మండళ్లు ప్రభుత్వానికి నివేదించాయి. పాలక మండళ్ల సూచనను ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే, ఆస్తిపన్ను పెంపు వల్ల ప్రజల్లో తమపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు నెపం పారిశుద్ధ్య కార్మికులపై వేయాలని భావిస్తోంది. […]
Advertisement
పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచేందుకు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది. 2006 తర్వాత మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచనందున తమకు ఆదాయం గణనీయంగా తగ్గిందని మున్సిపల్ పాలక మండళ్లు ప్రభుత్వానికి నివేదించాయి. పాలక మండళ్ల సూచనను ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే, ఆస్తిపన్ను పెంపు వల్ల ప్రజల్లో తమపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు నెపం పారిశుద్ధ్య కార్మికులపై వేయాలని భావిస్తోంది. కార్మికుల జీతాలు పెంచేందుకు తమ వద్ద నిధులు లేనందున తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆస్తిపన్నుపెంచుతున్నామనే ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఆస్తి పన్ను మాత్రమే కాకుండా ఖాళీ స్థలాల పన్ను, నీటిఛార్జీలు, బిల్డింగ్ పర్మిషన్లతో పాటు ట్రేడ్ లైసెన్స్‌లన్నింటినీ ఒకేసారి పెంచాలని పురపాలక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. అయితే, ఆగస్ట్ లో శాసనసభా సమావేశాలు ఉన్నందున ఆస్తి పన్ను పెంపు నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.
Advertisement