టీడీపీకి తలసాని పది సూటి ప్రశ్నలు!
పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారని తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీపై తలసాని నిప్పులు చెరిగారు. తనపై విమర్శలు చేస్తోన్న టీడీపీ నేతలు ముందు తమను తాము సంస్కరించుకోవాలని సూచించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఎగిరెగిరి పడుతున్న టీడీపీ ఏపీలో ఇతర పార్టీ నేతలను ఎలా చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన టీడీపీకి పది సూటి ప్రశ్నలు వేశారు. 1. పార్టీ ఫిరాయింపుల చట్టంపై తనపై కోర్టు వెళ్లిన టీడీపీ ఏపీలో వై ఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను […]
Advertisement
పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారని తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీపై తలసాని నిప్పులు చెరిగారు. తనపై విమర్శలు చేస్తోన్న టీడీపీ నేతలు ముందు తమను తాము సంస్కరించుకోవాలని సూచించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఎగిరెగిరి పడుతున్న టీడీపీ ఏపీలో ఇతర పార్టీ నేతలను ఎలా చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన టీడీపీకి పది సూటి ప్రశ్నలు వేశారు.
1. పార్టీ ఫిరాయింపుల చట్టంపై తనపై కోర్టు వెళ్లిన టీడీపీ ఏపీలో వై ఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను తమ పార్టీలో ఎలా చేర్చుకుంటుంది?
2. ఏపీలో ఇతర పార్టీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటున్న టీడీపీకి తనను విమర్శించే హక్కు ఎక్కడిది?
3. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సమయంలో ఏపీ ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
4. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లంచం ఇస్తూ పట్టుబడితే.. ఇంతవరకు దానిపై నోరు మెదపరేం?
5. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రేవంత్‌రెడ్డిలపై కనీసం పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నారు?
6. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, రుద్రమరాజు పద్మరాజు, చైతన్య రాజు, తిప్పేస్వామి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?
7. తాను రాజీనామా చేయలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా? (అంటూ గతేడాది రాజీనామా లేఖను చూపించారు)
8. ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలపై చర్యలు తీసుకోవాలని కోర్టులో కేసులు ఎందుకు వేయలేదు?
9. ఎర్రబెల్లి రాజీనామా చేసి సనత్‌నగర్‌కు వచ్చి పోటీ చేయగలడా?
10. మామపై పోటీ చేస్తానన్న చంద్రబాబు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?
Advertisement