ముగ్గురు ఆర్థిక మంత్రులపై లలిత్‌మోడి బాణం
ఐపీఎల్ స్కాంల్ ప్రధాన సూత్రధారి లలిత్ మోడీతో బీజేపీ అగ్రనేతలకు ఉన్న సంబంధాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే, మరోవైపు లలిత్ మోడీ ముగ్గురు ఆర్థిక మంత్రులకు క్రికెట్‌తో ఉన్న చీకటి సంబంధాలను బహిర్గతం చేసి మరో సంచలనం సృష్టించారు. ఇదివరకు భారత్‌లో రోజుకు పదివేల కోట్ల క్రికెట్ బెట్టింగ్ నడించిందని, రాజకీయ నేతల చేతుల్లో పడి క్రికెట్ డర్టీ గేమ్‌గా మారిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఫిక్సింగ్ వంటి అనైతిక […]
Advertisement
ఐపీఎల్ స్కాంల్ ప్రధాన సూత్రధారి లలిత్ మోడీతో బీజేపీ అగ్రనేతలకు ఉన్న సంబంధాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే, మరోవైపు లలిత్ మోడీ ముగ్గురు ఆర్థిక మంత్రులకు క్రికెట్‌తో ఉన్న చీకటి సంబంధాలను బహిర్గతం చేసి మరో సంచలనం సృష్టించారు. ఇదివరకు భారత్‌లో రోజుకు పదివేల కోట్ల క్రికెట్ బెట్టింగ్ నడించిందని, రాజకీయ నేతల చేతుల్లో పడి క్రికెట్ డర్టీ గేమ్‌గా మారిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఫిక్సింగ్ వంటి అనైతిక చర్యలకు తాను వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రులుగా పని చేసిన ముగ్గురు వ్యక్తులకు క్రికెట్ బెట్టింగ్‌తో దగ్గర సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. తన కుమారుడికి క్రికెట్ స్పాన్సర్‌షిప్ ఇప్పించాల్సిందిగా ఒక అగ్రనేత బీసీసీఐ అధ్యక్షుడిపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారని ఆ రికార్డులన్నీ తన వద్ద ఉన్నాయని, స్టార్ క్రికెటర్ గా వెలిగిన వ్యక్తికి కూడా తాను క్లీన్‌చిట్ ఇవ్వనని ఆయన అన్నారు. రాజకీయనేతలు, మాఫియా లీడర్లతో భారత క్రికెట్ భ్రష్టుపట్టిందని లలిత్ ఆరోపించారు. ఈ ముగ్గురు ఆర్థిక మంత్రులకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్న లలిత్ మోడి… ఆ ముగ్గురు ఎవరన్న దానిపై పెదవి విప్పడం లేదు. విలేఖరి గుచ్చి గుచ్చి అడిగినా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట పెడతానని మాత్రమే చెప్పి తప్పించుకున్నాడు. లలిత్ ఆ పేర్లు చెప్పకపోయినా ఆయన ప్రవేశపెట్టిన ఐపీఎల్ ట్వంటీ సమయంలో ఎవరున్నారన్నది అందరికీ తెలిసిందే. అయితే వారు నిజంగా లలిత్‌మోడి చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్‌తో సంబంధమున్న వారా లేక విషయాన్ని పక్కదారి పట్టించేందుకు మోడి కొత్త డ్రామా ఆడుతున్నాడా అన్నది మాత్రం ధ్రువపడని విషయం.
Advertisement