కంతనపల్లి రద్దులో రాజకీయం ..?
సాంకేతిక కారణాల వల్ల కంతనపల్లి ప్రాజెక్టును కొనసాగించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడంతో ఆ ప్రాజెక్టుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. అంతేకాదు, దేవాదుల ప్రాజెక్టుకు కూడా నీరందించలేమని ముఖ్యమంత్రి చేసిన విస్పష్ట ప్రకటనతో దేవాదుల శ్రీరామ్‌సాగర్ ఆయుకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, కంతనపల్లి ప్రాజెక్టును కొనసాగించలేమని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కంతపల్లి ప్రాజెక్టు కోసం సారవంతమైన తమ భూములను ఇచ్చేది లేదని […]
Advertisement
సాంకేతిక కారణాల వల్ల కంతనపల్లి ప్రాజెక్టును కొనసాగించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడంతో ఆ ప్రాజెక్టుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. అంతేకాదు, దేవాదుల ప్రాజెక్టుకు కూడా నీరందించలేమని ముఖ్యమంత్రి చేసిన విస్పష్ట ప్రకటనతో దేవాదుల శ్రీరామ్‌సాగర్ ఆయుకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, కంతనపల్లి ప్రాజెక్టును కొనసాగించలేమని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కంతపల్లి ప్రాజెక్టు కోసం సారవంతమైన తమ భూములను ఇచ్చేది లేదని 29 గ్రామాల ఆదివాసీ సంఘాలు చేసిన హెచ్చరికలకు భయపడి ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి వెనుకడుగు వేశారా? లేదంటే ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కారణంగా నిలిపి వేశారా? అన్నది రాజకీయవేత్తలను, నీరుపాదుదల నిపుణులను వేధిస్తోన్న ప్రశ్న. ఆదివాసీ సంఘాల హెచ్చరికలను ముఖ్యమంత్రి ఖాతరు చేయరని కేవలం ఆదివాసీలను అడ్డుపెట్టుకొని తన రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ఎత్తుగడ వేశారని కేసీఆర్ నైజం తెలిసిన వారు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించక ముందే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో కంతనపల్లి ప్రాజెక్టుకు టెండర్లు ఖరారయ్యాయి. ఈ టెండర్లను 2013లో వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రముఖ కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. వారిలో ఒకరు టీఆర్ఎస్ నేతలకు అత్యంత సన్నిహితుడు. టీఆర్ఎస్ నేతలతో కలిసి ఒక దినపత్రికను కూడా స్థాపించాడు. అయితే, ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీలో చేరారు. మరొకరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభసభ్యుడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు. ఈ ఇద్దరికీ చెక్ పెట్టేందుకే కేసీఆర్ కంతనపల్లి ప్రాజెక్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని రాజకీయవేత్తలు భావిస్తున్నారు.
Advertisement