నగదు రూపంలో గ్రాట్యుటీ
విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాల కోసం తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత లభించే గ్రాట్యుటీని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం, మరణించినప్పుడు చెల్లించే డెత్ అలవెన్స్‌ను రూ. పది వేల నుంచి రూ.20వేలకు పెంపు, వైద్య అలవెన్స్ ను నెలకు రూ. 200 నుంచి రూ. 350 పెంపుతో పాటు అర్థవేతన సెలవుకు లభించే వేతనాన్ని నగదుగా మార్చుకునే వెసులుబాటును కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ […]
Advertisement
విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాల కోసం తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత లభించే గ్రాట్యుటీని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం, మరణించినప్పుడు చెల్లించే డెత్ అలవెన్స్‌ను రూ. పది వేల నుంచి రూ.20వేలకు పెంపు, వైద్య అలవెన్స్ ను నెలకు రూ. 200 నుంచి రూ. 350 పెంపుతో పాటు అర్థవేతన సెలవుకు లభించే వేతనాన్ని నగదుగా మార్చుకునే వెసులుబాటును కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైలుపై సంతకాలు చేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉన్న 300 రోజుల అర్థవేతన సెలవులను నగదుగా మార్చుకునే అవకాశాన్ని ఇకపై పంచాయతీరాజ్, ఎయిడెడ్ టీచర్లకు కూడా కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పదో పిఆర్సీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత పూర్తి పెన్షన్‌ను పొందాలంటే వారికి 33 ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. ఈ విషయంలో గతంలో ఐదేళ్ల వెయిటేజీని ఇచ్చిన ప్రభుత్వం దీనిని ఎనిమిదేళ్లకు పెంచాలని చేసిన సూచనను పట్టించుకోలేదు. 70 ఏళ్లు నిండిన విశ్రాంత ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేయాలని చేసిన సూచనను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టింది.
Advertisement