స్త్రీలు ఇంట్లో, పురుషులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు
మహిళలకు ఇంటిలోనూ, పురుషులకు రోడ్ల మీద రక్షణ లేకుండా పోయిందని జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డ్సులో వెల్లడైంది.2014 వ సంవత్సరం గణాంక నివేదిక ప్రకారం ఆత్మహత్యల్లో మహిళలు, రోడ్డు ప్రమాదాల్లో పురుషులు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య గతంలో పోలిస్తే స్వల్పంగా పెరగ్గా, ఆత్మహత్య మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గతేడాది 42 వేల మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యం, కుటుంబ కలహాలు, శారీరక వేధింపులు, అత్యాచార బాధితులు, వరకట్న […]
Advertisement
మహిళలకు ఇంటిలోనూ, పురుషులకు రోడ్ల మీద రక్షణ లేకుండా పోయిందని జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డ్సులో వెల్లడైంది.2014 వ సంవత్సరం గణాంక నివేదిక ప్రకారం ఆత్మహత్యల్లో మహిళలు, రోడ్డు ప్రమాదాల్లో పురుషులు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య గతంలో పోలిస్తే స్వల్పంగా పెరగ్గా, ఆత్మహత్య మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గతేడాది 42 వేల మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యం, కుటుంబ కలహాలు, శారీరక వేధింపులు, అత్యాచార బాధితులు, వరకట్న వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మనదేశంలో గత కొద్ది సంవత్సరాలుగా పురుషుల మరణానికి రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా కారణమవుతున్నాయి. 2014లో 1.2 లోలక్షల మంది మగవారు యాక్సిడెంట్స్‌లో మరణించారు. ఈ ప్రమాదాల్లో 18 నుంచి 30 సంవత్సరాల లోపు యువకులే ఎక్కువగా మరణించడం గమనార్హం.
Advertisement