జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు 47 శాతం పెంపు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఉద్యోగులకు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పారిశుధ్య కార్మికులకు, ప్రభుత్వ డ్రైవర్లకు జీతాలు పెంచుతూ ప్రకటన చేసింది. 47.05 శాతం జీతాలు పెంచుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ. 8,500 నుంచి 12,500కు, డ్రైవర్లకు 10,200 రూపాయల నుంచి 15 వేలకు పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి గురువారం నుంచి సమ్మె విరమించి విధుల్లో చేరిన వారికి […]

Advertisement
Update:2015-07-16 16:43 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఉద్యోగులకు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పారిశుధ్య కార్మికులకు, ప్రభుత్వ డ్రైవర్లకు జీతాలు పెంచుతూ ప్రకటన చేసింది. 47.05 శాతం జీతాలు పెంచుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ. 8,500 నుంచి 12,500కు, డ్రైవర్లకు 10,200 రూపాయల నుంచి 15 వేలకు పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి గురువారం నుంచి సమ్మె విరమించి విధుల్లో చేరిన వారికి మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని, అయితే ఈరోజు వరకు ఉద్యోగాల్లోకి రాని వారిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశించారు.

అయితే ఇది కార్మికులకు ఏమేరకు ఆమోదయోగ్యం ఉంటుందో అర్దం కావడం లేదు. ఇప్పటివరకు మెజారిటీ సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు విధుల్లో చేరారని 75 శాతం మంది తమ పనులు చేసుకుంటున్నారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ చెప్పడం చూస్తే మిగిలిన 25 శాతం మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తారా అనే సందేహం కలుగుతోంది. నిజానికి కార్మిక సంఘాల్లో ఏడు విధుల్లో చేరలేదని కేవలం టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం ఒక్కటే సోమేష్‌ కుమార్‌ మాటలకు లొంగిపోయిందని, నిజానికి ఆ కార్మిక సంఘానికి గుర్తింపు కూడా లేదని వారంటున్నారు. అయితే వామపక్షాలతోపాటు తెలంగాణలోని తెలుగుదేశం, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు జీహెచ్‌ఎంసీ కార్మికులకు అండగా ఉంటామని ప్రకటించాయి. రేపు బంద్‌కు కూడా వీరంతా సంఘీభావం ప్రకటించారు. విధులకు హాజరైన వారు నిజంగా 75 శాతం మంది ఉంటే మిగిలిన 25 శాతం మంది కోసమే వీరంతా బంద్‌కు మద్దతిస్తున్నారా అనే సందేహం తలెత్తక మానదు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాల పెంపు ప్యాకేజీ కొత్త వివాదాలకు తెర తీస్తుందా… లేక మొత్తం కథను సుఖాంతం చేస్తుందా అనేది రేపటికి గాని తేలదు. వేతనాల పెంపు వరకు ప్రకటించి ఉంటే జీహెచ్‌ఎంసీ కార్మికులు, ఉద్యోగులు బహుశా రేపటి నుంచి విధులకు హాజరయ్యేవారేమో. కాని ఈరోజు వరకు అంటే గురువారం వరకు విధుల్లో చేరని ఉద్యోగులను, కార్మికులను తొలగించమని కమిషనర్‌ ఆదేశించడం కొత్త వివాదానికి తెర తీసినట్టేనని చెప్పక తప్పదు. అసలు ఏం జరుగుతుందనేది రేపటి వరకు వేచి చూస్తే తప్ప తేలే విషయం కాదు.

Tags:    
Advertisement

Similar News