అమెరికన్ దర్శకురాలిని వేధిస్తున్న అమెరికా
స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపంలా కనిపించే అమెరికా తమ సొంత ప్రయోజనాలకు అడ్డువస్తే స్వదేశీ పౌరులను సైతం మానసిక వేధింపులకు గురి చేస్తుందని చెప్పడానికి చక్కని ఉదాహరణ ఈ ఉదంతం. అమెరికా పౌరురాలు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత లారాపోయిట్రాస్‌పై అమెరికా ప్రస్తుతం కక్ష సాధిస్తోంది. ఈ ఆగ్రహానికి కారణం ఏమిటంటే, “స్నోడెన్” మీద ఆమె డాక్యుమెంటరీ నిర్మించడం. అమెరికా తమ పౌరులు కొందరి మీద, మరికొందరు విదేశీయుల మీద నిఘా పెట్టిందని, వాళ్ళ ఫోన్ సంభాషణలు, ఈ-మెయిల్ […]
Advertisement
స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపంలా కనిపించే అమెరికా తమ సొంత ప్రయోజనాలకు అడ్డువస్తే స్వదేశీ పౌరులను సైతం మానసిక వేధింపులకు గురి చేస్తుందని చెప్పడానికి చక్కని ఉదాహరణ ఈ ఉదంతం. అమెరికా పౌరురాలు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత లారాపోయిట్రాస్‌పై అమెరికా ప్రస్తుతం కక్ష సాధిస్తోంది. ఈ ఆగ్రహానికి కారణం ఏమిటంటే, “స్నోడెన్” మీద ఆమె డాక్యుమెంటరీ నిర్మించడం. అమెరికా తమ పౌరులు కొందరి మీద, మరికొందరు విదేశీయుల మీద నిఘా పెట్టిందని, వాళ్ళ ఫోన్ సంభాషణలు, ఈ-మెయిల్ సందేశాలను దొంగచాటుగా రికార్డ్ చేసిందని స్నోడెన్ ప్రపంచానికి వెల్లడించాడు. అమెరికా చేసిన నీతిమాలిన పనిని స్నోడెన్ ప్రపంచం ముందు బట్టబయలు చేశాడు. అందుకే అతని మీద అమెరికాకు కోపం. ఆ కసి తీర్చుకోవడానికి అతనిపై వేధింపులకు పాల్పడింది. ఈ వివరాలను డాక్యుమెంటరీగా తీసిన లారా పోయిట్రాస్.పై ఇపుడు అమెరికా కక్ష సాధిస్తోంది. 2006 నుంచి ఇప్పటివరకు ఆమె విదేశాల నుంచి అమెరికా తిరిగివచ్చిన ప్రతీసారి ఆమెను నిర్భంధించి తనిఖీ చేస్తున్నారు. ఇలా 50 సార్లకుపైగా జరిగిందని ఆమె బాధపడ్డారు. ఇలా ఎందుకు జరుగుతుందో, కారణం ఏమిటో తెలపాలని వివిధ ప్రభుత్వ సంస్థలకు ఆమె రాత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఆమె స్నోడెన్‌పై తీసిన డాక్యుమెంటరీ, ఇరాక్ పై తీసిన డాక్యుమెంటరీ, గ్వాంటెనామాపై తీసిన డాక్యుమెంటరీ లాంటివి అమెరికా దమన నీతిని ఎండగట్టేవే. వాటికి పలుదేశాలు అవార్డులు ఇస్తే, అమెరికా మాత్రం ఈ విధంగా కక్ష తీర్చుకుంటోంది.
Advertisement