పాలమూరు జిల్లాలో ఆదిమానవుడి పెయింటిగ్స్
క్రీ.పూర్వం 8 నుంచి 12 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల పెయింటింగ్స్‌ను మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో కనుగొన్నారు. చైదర్‌పల్లి సమీపంలోని బయ్యన్నగుట్టపై ఇవి లభ్యమయ్యాయని పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ శిల్పకళా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసాచారి తెలిపారు. బయ్యన్నగుట్టలోని రాళ్లపై ఆదిమానవుడు వేసిన బల్లి, కమలం పువ్వు, పాము, ధనుస్సు, తొండ కుఢ్య చిత్రాలను ఆయన గుర్తించారు. శ్రీశైలం ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ వెలుగులోని తెచ్చిన మన్యంకొండ అలివేలు మంగతాయారు దేవస్థానం సమీపంలోని గుట్టపైని […]
Advertisement
క్రీ.పూర్వం 8 నుంచి 12 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల పెయింటింగ్స్‌ను మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో కనుగొన్నారు. చైదర్‌పల్లి సమీపంలోని బయ్యన్నగుట్టపై ఇవి లభ్యమయ్యాయని పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ శిల్పకళా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసాచారి తెలిపారు. బయ్యన్నగుట్టలోని రాళ్లపై ఆదిమానవుడు వేసిన బల్లి, కమలం పువ్వు, పాము, ధనుస్సు, తొండ కుఢ్య చిత్రాలను ఆయన గుర్తించారు. శ్రీశైలం ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ వెలుగులోని తెచ్చిన మన్యంకొండ అలివేలు మంగతాయారు దేవస్థానం సమీపంలోని గుట్టపైని ఆదిమానవుల పెయింటింగ్‌లను కూడా ఆయన పరిశీలించారు. ఆదిమానవుడు వేసిన విత్తనం, మొలకెత్తే విత్తనం, రెండు పాముల కలయికతో ఉన్న చిత్రాలతో పాటు జిల్లాలో పలు శిల్పకళా సంపద దాగి ఉందని ఆయన వెల్లడించారు.
Advertisement