రహదారులు, నౌకాయాన రంగాల్లో 50 లక్షల ఉద్యోగాలు
రహదారులు, నౌకాయాన రంగాల అభివృద్థితోనే పొరుగు దేశాలతో బంధాలు పటిష్ట మవుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఆ రెండు రంగాల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించి, భారీ ప్రాజెక్టులను చేపట్టనుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో రహదారులు, నౌకాయాన రంగాల ద్వారా యువతకు సుమారు 50 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఈ రెండు రంగాల్లో రూ. 6 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టులు రూపొందిస్తున్నామని ఆయన […]
Advertisement
రహదారులు, నౌకాయాన రంగాల అభివృద్థితోనే పొరుగు దేశాలతో బంధాలు పటిష్ట మవుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఆ రెండు రంగాల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించి, భారీ ప్రాజెక్టులను చేపట్టనుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో రహదారులు, నౌకాయాన రంగాల ద్వారా యువతకు సుమారు 50 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఈ రెండు రంగాల్లో రూ. 6 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టులు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ రెండు మార్గాలను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయడం ద్వారా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన అన్నారు.భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాల మధ్య ఎనిమిది బిలియన్ల డాలర్ల వ్యయంతో రూపొందించిన ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తవుతాయని ఆయన చెప్పారు. రూ. 22 వేల కోట్ల ఖర్చుతో శ్రీలంక భారత్‌ల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తామని, అందుకోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు సహాయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు 22 కిలోమీటర్ల రవాణా కారిడార్ పునరుద్ధరిస్తామని, భారత్‌కు, మయన్మార్, థాయ్‌లాండ్‌ల మధ్య కుదిరిన చరిత్రాత్మక రవాణా ఒప్పందం త్వరలో అమల్లోకి రానుందని ఆయన చెప్పారు.
Advertisement