లలిత్ మోడీపై రాష్ట్రపతి భవన్ ఫిర్యాదు
ఎన్డీఏ సర్కార్‌లోని సుష్మా స్మరాజ్, వసుంధరారాజేలతోపాటు ప్రతిపక్ష యూపీఏ అధినేత సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు వాద్రాలతో తనకున్న సంబంధాలను బహిర్గతం చేస్తూ ఇప్పటికే పలు వివాదాలకు నిలయమైన లలిత్ మోడీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ప్రతిష్ఠను దిగజార్చారని రాష్ట్రపతి భవన్ అధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 23, 25వ తేదీల్లో మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన చిత్రాలతో పాటు, […]
Advertisement
ఎన్డీఏ సర్కార్‌లోని సుష్మా స్మరాజ్, వసుంధరారాజేలతోపాటు ప్రతిపక్ష యూపీఏ అధినేత సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు వాద్రాలతో తనకున్న సంబంధాలను బహిర్గతం చేస్తూ ఇప్పటికే పలు వివాదాలకు నిలయమైన లలిత్ మోడీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ప్రతిష్ఠను దిగజార్చారని రాష్ట్రపతి భవన్ అధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 23, 25వ తేదీల్లో మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన చిత్రాలతో పాటు, ఇతర వివరాలను కూడా ఫిర్యాదు కాపీతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు రాష్ట్రపతి భవన్ అధికారులు పంపారు. రాష్ట్రపతి గతంలో ఆర్థికమంత్రిగా ఉన్నప్పడు వివేక్ నాగ్‌పాల్ అనే వ్యాపారి నుంచి లబ్ది పొందారని ఆరోపిస్తూ లలిత్ మోడీ రాష్ట్రపతి, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్, వ్యాపారి వివేక్ నాగ్‌పాల్ ఫొటోలను ట్విట్టర్‌లో ఉంచారు. అంతేకాకుండా కొచ్చి ఐపీఎల్ ప్రాంచైజీలో వాటాదారుల పెట్టుబడుల గురించి తాను ప్రశ్నించినందుకే అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ఈడీ విచారణకు ఆదేశించారని మరో ఆరోపణ చేశారు. రాష్ట్రపతి భవన్ అధికారులు చేసిన ఫిర్యాదును పోలీస్ కమిషనర్ ఆర్థికనేరాల విభాగానికి పంపారని, ఈ ఫిర్యాదును ఐపీసీ సెక్షన్ల కింది కేసు నమోదు చేయాలా, లేక ట్విట్టర్‌లో ఆ పేజీని బ్లాక్ చేసేందుకు స్థానిక కోర్టును ఆశ్రయించాలా అన్న కోణంలో ఆలోచిస్తున్నామని, అందుకోసం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.
Advertisement