సోషల్‌మీడియాపై కన్నేసిన ఏపీ సీపీఎం
ప్రస్తుత డిజిటల్ యుగతంలో సోషల్‌మీడియాకున్న ప్రాధాన్యత ఎవరూ కాదనలేనిది. అందుకే రాజకీయపార్టీలు సోషల్‌మీడియాను సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సాంకేతికంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలోనూ, వాటిని ఉపయోగించుకోవడంలోనూ ఎప్పుడూ ముందుండే సీపీఎం సోషల్‌మీడియాలోనూ ఇక నుంచి తమ కార్యకలాపాలను విస్తృతపరచుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీపీఎం విభాగం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. జిల్లాలన్నిటిలోనూ ప్రత్యేకంగా సోషల్ మీడియాకు బాధ్యులను నియమించుకుంటోంది. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే సిబ్బందిని ఏర్పాటు చేసుకున్న సంగతి తెల్సిందే. జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను అనుసంధానం చేసేందుకు […]
Advertisement
ప్రస్తుత డిజిటల్ యుగతంలో సోషల్‌మీడియాకున్న ప్రాధాన్యత ఎవరూ కాదనలేనిది. అందుకే రాజకీయపార్టీలు సోషల్‌మీడియాను సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సాంకేతికంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలోనూ, వాటిని ఉపయోగించుకోవడంలోనూ ఎప్పుడూ ముందుండే సీపీఎం సోషల్‌మీడియాలోనూ ఇక నుంచి తమ కార్యకలాపాలను విస్తృతపరచుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీపీఎం విభాగం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. జిల్లాలన్నిటిలోనూ ప్రత్యేకంగా సోషల్ మీడియాకు బాధ్యులను నియమించుకుంటోంది. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే సిబ్బందిని ఏర్పాటు చేసుకున్న సంగతి తెల్సిందే. జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను అనుసంధానం చేసేందుకు గాను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను కూడా వారు ప్రారంభించారు. తాజాగా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఒక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి ఈ వెబ్‌సైట్ మరింతగా ఉప యోగపడుతుందని, దీనిని ప్రజలకు అంకితం చేస్తున్నామని వెల్లడించారు. వెబ్‌సైట్‌ను జయప్రదంగా నడపడానికి అనేక మంది మేధావులు, అర్థశాస్త్రవేత్తలు తమ సేవలను అందించబోతున్నారని చెప్పారు.
Advertisement