ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి వైసీపీ వాకౌట్
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రజాస్వామికంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకు నిరసనగా తాము ఎన్నికల బరిలోంచి తప్పుకుంటున్నామని ఆయన తెలిపారు. ఓటర్లను కొనుగోలు చేయడం, వైసీపీ నాయకులను ప్రలోభ పెట్టడం టీడీపీ చేస్తోందని ఆయన అరోపించారు. తన పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించుకోడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఏంపీటీసీ సభ్యులను కొనేయాలని లక్ష్యంగా పెట్టుకుని వైఎస్ఆర్ […]
Advertisement
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రజాస్వామికంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకు నిరసనగా తాము ఎన్నికల బరిలోంచి తప్పుకుంటున్నామని ఆయన తెలిపారు. ఓటర్లను కొనుగోలు చేయడం, వైసీపీ నాయకులను ప్రలోభ పెట్టడం టీడీపీ చేస్తోందని ఆయన అరోపించారు. తన పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించుకోడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఏంపీటీసీ సభ్యులను కొనేయాలని లక్ష్యంగా పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లా చిన వెంకటరెడ్డిని ఓడించాలని చూస్తున్నారని, మాగుంటకు ఓటు వేయకపోతే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారని, దీనికి నిరసనగా తాము ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైదొలగుతున్నామని సుబ్బారెడ్డి ప్రకటించారు.
Advertisement