రాష్ట్ర‌ప‌తి కోసం ముస్తాబైన బొల్లారం

భార‌త రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సోమ‌వారం హైద‌రాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి అతిథి గృహానికి రానున్నారు. ఆయ‌న రాక కోసం బొల్లారం అతిథి గృహం ఇప్ప‌టికే అత్యంత సుంద‌రంగా ముస్తాబైంది. రాష్ట్ర‌ప‌తి సోమ‌వారం ఉద‌యం  11.30 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరి మ‌ధ్నాహ్నం 2.05 నిమిషాల‌కు  హైద‌రాబాద్ లోని  హ‌కీంపేట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో పాటు సీఎం, రాష్ట్ర‌మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు  ఆయ‌న‌కు ఘ‌న‌స్వాగతం ప‌ల‌క‌నున్నారు. అనంత‌రం ఆయ‌న రోడ్డు మార్గం ద్వారా […]

Advertisement
Update:2015-06-28 18:34 IST

భార‌త రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సోమ‌వారం హైద‌రాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి అతిథి గృహానికి రానున్నారు. ఆయ‌న రాక కోసం బొల్లారం అతిథి గృహం ఇప్ప‌టికే అత్యంత సుంద‌రంగా ముస్తాబైంది. రాష్ట్ర‌ప‌తి సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరి మ‌ధ్నాహ్నం 2.05 నిమిషాల‌కు హైద‌రాబాద్ లోని హ‌కీంపేట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో పాటు సీఎం, రాష్ట్ర‌మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు ఘ‌న‌స్వాగతం ప‌ల‌క‌నున్నారు. అనంత‌రం ఆయ‌న రోడ్డు మార్గం ద్వారా అతిథిగృహానికి చేరుకుంటారు. ప్ర‌తి ఏటా రాష్ట్ర‌ప‌తి న‌గ‌రంలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో విడిది చేయ‌డం ఆన‌వాయితీ. ఈ ఏడాది కూడా ఆ ఆన‌వాయితీని కొన‌సాగించేందుకు రాష్ట్ర‌ప‌తి న‌గ‌రానికి వ‌స్తున్నారు. ఆయ‌న జూలై 8 వ‌ర‌కు ఇక్క‌డ బ‌స చేయ‌నున్నారు. జూలై 1వ తేదీన ఆయ‌న తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వెళ‌తారు. జూలై 3న హైద‌రాబాద్ లోని ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ (హెచ్ ఐసీసీ)లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్‌రావు రాసిన ఉనికి పుస్త‌కాన్ని ఆవిష్క‌రిస్తారు. జూలై 6న రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో న‌క్ష‌త్ర వాటిక‌ను ప్రారంభిస్తారు.

Tags:    
Advertisement

Similar News